తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా పదిమంది న్యాయమూర్తులను నియమిస్తూ.. కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.అంతేకాకుండా ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా, వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
న్యాయవాదుల విభాగం నుంచి..
1. కాసోజు సురేందర్,
2. సూరేపల్లి నంద,
3. ముమ్మినేని సుధీర్ కుమార్,
3. జువ్వాడి శ్రీదేవి,
4. ఎన్. శ్రావణ్ కుమార్,
5. వెంకట్ ఉన్నారు.
న్యాయాధికారుల విభాగం నుంచి..
6. గున్ను అనుపమా చక్రవర్తి,
7. మాటూరి గిరిజా ప్రియదర్శిని,
8. సాంబశివరావు నాయుడు,
9. ఏనుగు సంతోష్ రెడ్డి,
10. దేవరాజ్ నాగార్జునను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది.