మీరంతా కోన్ కిస్కా గొట్టంగాళ్లు.. క్రిటిక్స్‌పై అలీ ఫైర్.. - MicTv.in - Telugu News
mictv telugu

మీరంతా కోన్ కిస్కా గొట్టంగాళ్లు.. క్రిటిక్స్‌పై అలీ ఫైర్..

October 21, 2019

ali.

సినిమా బాగాలేదని చెప్పడానికి మీరేమైనా తోపులా? అని హాస్యనటుడు అలీ సినీ విమర్శకులపై ఘాటుగా స్పందించారు. ఆయన తాజాగా నటించిన ‘రాజుగారి గది 3’ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలీ హీరో స్నేహితుడిగా నటించారు. మొన్న ఈ సినిమా విడుదల కాగా, సినిమా బాగలేదని టాక్ తెచ్చుకుంది. దీనిపై అలీ గుర్రుమన్నారు. ‘సినిమా బాలేదని చెప్పడానికి మీరు ఎవరు? మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సినిమా బాగుంది బాగాలేదని చెప్పడానికి మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. మీరంతా కోన్ కిస్కా గొట్టంగాళ్లు’ అని విరుచుకుపడ్డారు. 

ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అలీ విమర్శకులపై మండిపడ్డారు. ‘నేను థియేటర్‌కు వెళ్లి సినిమా ఎప్పుడు చూడను.. అలాంటిది నేను ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూశాను. సినిమాకు మేము పడ్డ కష్టం మాకు తెలుసు. సినిమాలను మీఒక్క మాటతో ఎప్పుడూ కించపరచకండి. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో.. వాళ్లని నమ్ముకుని మేము సినిమా పరిశ్రమకు రాలేదు. సినిమాపై ఒక రాయి వేసేస్తే మేం తోపులం అని ఫీల్ అవుతారు’ అని అలీ ఫైర్ అయ్యారు.