హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం..  - MicTv.in - Telugu News
mictv telugu

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం.. 

May 26, 2020

WHO Bans Hydroxychloroquine Queen Tablet

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కరోనా ఎంట్రీతో ఇప్పుడు చాలా మంది ఈ ఔషధం కోసం ఎగబడ్డారు. ప్రపంచ దేశాలు కూడా భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకున్నాయి. మలేరియా ఔషదమైన ఈ మందులు కరోనా కట్టడికి ఉపయోగపడటంతో వీటికి గిరాకీ పెరిగింది. అయితే దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై తాత్కాలిక నిషేధం విస్తున్నట్టు వెల్లడిచింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కరోనా రోగులకు ఈ మందు ఇవ్వటాన్ని కొంతకాలం ఆపాల్సిందిగా ప్రకటన చేసింది. అయితే వీటిని ఇతర క్లినికల్ ట్రయల్స్‌లో యధావిధిగా కొనసాగించవచ్చునని తెలిపింది.

కరోనా నియంత్రణలో ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ అత్యంత కీలకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా వీటిని వాడుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఐసీఎమ్మార్ కూడా ఇది ప్రభావ వంతంగా పని చేస్తుందని తెలిపింది. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయని పలువురు పరిశోధకులు హెచ్చరించారు. దీంతో దాని పనితీరుపై పరిశీలన జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో కొంత కాలం పాటు కరోనా రోగులకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను నిలిపివేయనున్నారు.