రష్యా వ్యాక్సిన్ పై WHO కీలక వ్యాఖ్య  - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా వ్యాక్సిన్ పై WHO కీలక వ్యాఖ్య 

August 14, 2020

WHO Comment on Russia Vaccine

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు పోటాపోటీగా తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో తొలిసారి రష్యా టికాతో ముందుకు వచ్చింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని రష్యా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే తొలి దేశంగా రికార్డులకు ఎక్కింది. అయితే దీని పని తీరుపై పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. దీనిపై WHO సీనియర్ సలహాదారుడు డాక్టర్ బ్రూస్ అయాల్వార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రష్యా కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. స్పుత్రిక్-వీ ఏ దశలో ఉందో తమకు వివరాలను ఇవ్వలేదని తెలిపారు. దీనిపై పూర్తి వివరాల కోసం తాము ఆ దేశంతో చర్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని మాత్రం చెప్పుకొచ్చారు. అందులో స్పుత్నిక్ లేదని వెల్లడించారు. దాని పనితీరు పరిశీలించాల్సి ఉందని అన్నారు. 9 వ్యాక్సిన్ల పనితీరును మాత్రం తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. దీంతో రష్యా ఇంత వరకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదనేది ఆసక్తిగా మారింది.