ఆరోగ్య సేతు యాప్ ఎవరు సృష్టించారో డేటానే లేదట  - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్య సేతు యాప్ ఎవరు సృష్టించారో డేటానే లేదట 

October 28, 2020

కరోనా వైరస్‌‌ను వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టింది.ఈ యాప్ ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్‌లో వేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ కూడా దీనికి ప్రచారం కల్పించారు. దీంతో చాలా మంది దీన్ని వాడటం మొదలుపెట్టారు. అయితే తాజాగా దీనిపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ఎవరు తయారు చేశారంటూ ఇటీవలో ఓ ఆర్టీఐ కార్యకర్త సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధికారుల నుంచి మాత్రం ఊహించని సమాధానం వచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద లేవని పేర్కొన్నారు. దీంతో యాప్ ఎవరు తయారు చేశారనే గందరగోళం ఏర్పడింది. 

ఆరోగ్యసేతు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసినట్టు ఆరోగ్య సేతు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది.  సౌరవ్ దాస్ అనే వ్యక్తి మాత్రం రెండు నెలల క్రితం వివరాల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అది అనేక శాఖలు తిరిగి చివరకు యాప్ తయారీకి సంబంధించిన పూర్తి ఫైల్ తమ వద్ద లేదంటూ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వెల్లడించింది. దీనిని తీవ్రంగా స్పందించిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సమాచారాన్ని వెళ్లడించడానికి అధికారులు నిరాకరించడంపై మండిపడింది. నవంబరు 24లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.