కరోనా ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది..డబ్ల్యూహెచ్ఓ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది..డబ్ల్యూహెచ్ఓ

August 1, 2020

who director Dr Tedros Adhanom Ghebreyesus about coronavirus

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెల్సిందే. ఈ వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ప్రపంచ స్తంభించిపోయింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఎందరో వేతన జీవులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి ప్రభావం ఒకటి రెండు సంవత్సరాలు ఉండదని ఏకంగా దశాబ్ద కాలం పాటు ఉంటూఉండని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గ్యాబ్రియోసిస్ తెలిపారు.

శుక్రవారం కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ టీమ్ అత్యవసరంగా సమావేశమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ..’కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది. మాస్క్‌‌లు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించాలి. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి పుట్టుకొస్తాయి. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుంది. కరోనా విషయంలో శాస్త్ర సాంకేతి సంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. ఇంకా చాలా వాటికి సమాధానం దొరకాల్సి ఉంది. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి  అవకాశం ఉంది.’ అని హెచ్చరించారు.