‘ దబాంగ్ 3 ’ సల్మాన్ సరసన ఎవరు ? - MicTv.in - Telugu News
mictv telugu

‘ దబాంగ్ 3 ’ సల్మాన్ సరసన ఎవరు ?

August 21, 2017

సల్మాన్ ఖాన్ సినిమాలల్లో ప్రత్యేకమైన సినిమాలుగా ‘ దబాంగ్ ’ సిరిస్ నిలిచి వుంటుంది. 2010 లో అభినవ్ కాశ్యప్ దర్శకుడిగా సల్మన్ – సోనాక్షి హీరో హీరోయిన్లుగా వచ్చి ఎంత పెద్ద హిట్టైందో మనందరికీ తెలిసిందే.

ఆ తర్వాత తన సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో దానికి సీక్వెల్ గా ‘ దబాంగ్ 2 ’ వచ్చింది. 2012 లో ఈ సినిమా కూడా పెద్ద హిట్టుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రస్తావన ఎందుకంటే సల్మాన్ మళ్ళీ దబాంగ్ కు ప్రీక్వెల్ తీసే ఇంట్రస్టులో వున్నాడు.

ఈ ‘ దబాంగ్ 3 ’ సినిమాకు దర్శకుడు ప్రభుదేవాను ఫైనల్ చేసినట్టు కూడా వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ‘ టైగర్ జిందా హై ’ అనే సినిమాలో నటిస్తున్న సల్మాన్ దానికి గుమ్మడి కాయ కొట్టగానే దబాంగ్ 3 కి కొబ్బరి కాయి కొడతాడట. అయితే ఇక్కడ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో సల్మాన్ మనసుపడి మనువాడాలనుకుంటున్న లూలియా వంటూర్ ఇందులో హీరోయిన్ గా చేయటం.

బ్రహ్మచారిగా మిగిలిపోతాడనుకున్న సల్మాన్ ఇంత వరకు తనకు ఏ అమ్మాయీ నచ్చినట్టు ఎక్కడా చెప్పలేదు. కానీ లూలియా వంటూర్ విషయంలో సల్మాన్ మొదటి నుండీ చాలా ఇంట్రస్టును చూపుతున్నాడు.

ఆమెను త్వరలోనే వివాహం చేస్కుంటాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు సడెన్ గా ఇలా లూలియా దబాంగ్ 3 లో నటించడమనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే రెండు సిరీస్ లలో సోనాక్షి సిన్హానే హీరోయిన్ గా చేసింది. మరి ఇందలో కూడా తను చేస్తేనే సినిమాకు యాప్ట్ అవుతుందనేది బాలీవుడ్ గుసగుస. తనను పక్కనపెట్టి లూలియాను తీస్కుంటాడా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి హిందీ ఆడియన్సులో. త్వరలో కాస్ట్ అండ్ క్రూ గురించి అనౌన్స్ చేస్తాడట తమ్ముడు అర్బాజ్ ఖాన్. అప్పటి వరకు రకరకాల ఊహాగానాలతో వెయిట్ చెయ్యాల్సిందే.