Who is no 1 South hero
mictv telugu

సౌత్ లో సూర్య సంచలనం.. బన్నీ, విజయ్ మధ్య తీవ్ర పోరు..!

January 16, 2023

Who is no 1 South hero

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB) నిర్వహించిన సర్వేలో తమిళ నటుడు సూర్య సంచలనం సృష్టించాడు. దక్షిణ భారత ప్రముఖుల జాబితాలో సూర్య ఏకంగా అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. రాష్ట్రాల పరంగా చూసుకుంటే.. తమిళంలో సూర్య, తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ అగ్రస్థానంలో ఉంటే.. ఓవరాల్ సౌత్ మొత్తానికి అగ్ర స్థానంలో నిలిచాడు సూర్య. ఇక సూర్య తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాది నుండి మొత్తం 18 మంది సెలబ్రిటీలు పోటీలో నిలబడగా.. 5246 మంది ప్రతివాదులు పాల్గొని నిర్వహించిన ఈ సర్వేలో సూర్య అగ్రస్థానంలో నిలిచాడు. తెలుగు నుండి ఆరుగురు నటులు, తమిళం నుండి ఆరుగురు నటులు, కన్నడ నుండి ఇద్దరు మరియు మలయాళం నుండి నలుగురు నటులు జాబితా ఉన్నారు.

సెలబ్రిటీలపై పరిశోధన నిర్వహించే సంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ కి మంచి పేరుంది. వీళ్ళు దక్షిణాది కోసం ప్రత్యేకంగా ఈ పరిశోధన చేయడం ఇదే మొదటిసారి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల మధ్య తెలుగులో తీవ్ర పోటీ నెలకొనగా.. బన్నీనే చివరికి టాప్ రేటింగ్ పొందాడు. ఇక తమిళం నుంచి విజయ్, శివ కార్తికేయన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కిచ్చా సుదీప్ కన్నడ ఇండస్ట్రీ నుండి టాప్ లో నిలిచి రికార్డు సృష్టించాడు. ఇక మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాసిల్ అగ్రస్థానంలో ఉన్నారు. ‘సీతారామం’ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ కొట్టాడు దుల్కర్. ఈ సినిమాలో దుల్కర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరోలైపు ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా తన మేనరిజం, యాక్టింగ్‌తో ఫహాద్ ఫాసిల్ మెప్పించాడు. ఇక ఈ సంవత్సరం సౌత్ ఇండియాలో టాప్ సెలబ్రిటీ ఎవరు అన్న ప్రశ్నకి.. సూర్య అనే సమాధానం దొరికేసింది సినీ లవర్స్ కి.