ఎవరీ డాక్టర్ పుష్ప మిత్ర భార్గవ్ ? - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరీ డాక్టర్ పుష్ప మిత్ర భార్గవ్ ?

August 2, 2017

భారత దేశం ఆధునికి జీవశాస్త్ర వాస్తుశిల్పిగా, అసామాన్య శాస్త్రజ్ఞుడిగా పేరు గడించిన అత్యున్నత శిఖరం నేలకొరిగింది. డాక్టర్ పుష్ప మిత్ర భార్గవ్ ఎంతో పేరున్న వైద్యుడు. బయో టెక్నాలజీలో మార్గ దర్శకుడైన ఆయన మంగళవారం రాత్రి చనిపోయారు. ఆయన వయసు 89 సంవత్సరాలు.
ఫిబ్రవరి 22, 1928 న రాజస్థాన్ లోని అజ్ మేర్ లో జన్మించారు. ‘ జన్యు ఇంజనీరింగ్ ’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం యొక్క వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70 లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు.
హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్ మరియు బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ (BREAD), న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు ఛైర్మెన్ గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ గా కూడా పనిచేశారు.
భార్గవ 100 వరకు జాతీయ, అంతర్ఝాతీయ స్థాయి గౌరవాలను మరియు అవార్డులను అందుకున్నారు. అలాగే 1986 లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998 లో లెజియన్ డి హొన్నూర్ తో సత్కరించబడ్డారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. భారత జాతి గర్వించే స్థాయికి ఎదిగారు.

 

వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. ఎప్పుడూ సమాజంతో తన సంబంధాన్ని కలిగి ఉన్నారు.

డాక్టర్ భార్గవ కుమార్తె వనీతా, కొడుకు మోహిత్ మరియు కుటుంబంలో చాలామంది శాస్త్రవేత్తలను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. CCMB సిబ్బంది డాక్టర్ భార్గవ మరణానికి విషాదం వ్యక్తం చేశారు. భార్గవ యొక్క మార్గదర్శక దృష్టి మరియు ప్రయత్నాలు 1977 లో CCMB స్థాపనకు, ప్రాథమిక జీవశాస్త్రంలో పరిశోధనకు ఒక సంస్థగా రూపుదిద్దుకుంది. మహనీయలు మరణం చరిత్రకు కానుక కావచ్చు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావచ్చును. కానీ వారి యొక్క మేథా సంపత్తిని, అలాంటి మనుషులను తిరిగి పొందలేదు ఈ దేశం అనడానికి డాక్టర్ పుష్ప మిత్ర భార్గవే ఒక నిలువెత్తు నిదర్శనం.