భారత్‌లో కరోనా మరణాలపై WHO.. తీవ్రంగా స్పందించిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా మరణాలపై WHO.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

May 6, 2022

కరోనా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లలో కోటిన్నర మంది ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో దాదాపు 47 లక్షల మంది చనిపోయారని అంచనా వేసింది. అయితే ఆయా దేశాలు సమర్పించిన లెక్కల ప్రకారం ఇంతవరకు ప్రపంచంలో 60 లక్షల మరణాలు మాత్రమే సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, భారత్‌లో మరణాల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గురువారం నాటికి 5.23 లక్షల మంది మాత్రమే చనిపోయారని అధికారికంగా వెల్లడించింది. మరణాల లెక్కింపులో డబ్ల్యూహెచ్‌వో అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలపై ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, వాటిని పట్టించుకోలేదని మండిపడింది. నివేదిక అశాస్త్రీయంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్, నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఖండించారు. భారత డేటాను విస్మరించారని విచారం వ్యక్తం చేశారు.