యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పిన.. యూరప్ కాలజ్జాని - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పిన.. యూరప్ కాలజ్జాని

March 2, 2022

hb

ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధంలో ‘రష్యా గెలుస్తుందా లేక ఉక్రెయిన్ గెలుస్తుందా’ అన్న విషయంలో ఓ కాలజ్జాని ‘రష్యా దేశమే గెలుస్తుంది’ అని చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి. బల్గేరియాకు చెందిన బాబా వంగా ఓ కాలజ్ఞానిగా యూరప్ దేశాల్లో గుర్తింపు పొందారు. ఆమె 1996లోనే పరమపదించారు. బాబా వంగాను బల్గేరియా దైవదూతగా అక్కడి దేశస్థులు పిలుస్తుంటారు.

 

 

అయితే, ఆమె తన పన్నెండవ ఏటనే కంటిచూపు కోల్పోయిన, తన ఎదుట నిలబడిన వారి వివరాలను, భవిష్యత్తును కచ్చితంగా చెప్పేదట. ఆమె చెప్పిన వాటిలో అత్యధిక శాతం నిజంగా జరుగుతాయట. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికా ట్రేడ్ సెంటర్‌పై దాడి చేస్తారని, బాబా వంగా ముందే చెప్పారని, ఈయూ నుంచి పలు దేశాలు తప్పుకుంటాయని ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయని యూరప్ దేశాల్లో ప్రచారంలో ఉంది.

మరోపక్క ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని బాబా వంగా ఆనాడే ఊహించారట. రష్యా దాడి నుంచి ఉక్రెయిన్ తప్పించుకోవడం అసాధ్యం అని, రష్యా ప్రపంచాధిపత్యం వహించడమే కాకుండా, వ్లాదిమిర్ పుతిన్ సర్వశక్తిమంతుడు అవుతాడని ఆ కాలజ్ఞాని చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అంతేకాకుండా యూరప్ ఖండం ఒక బంజరు భూమిలా మారిపోతుందని, రష్యా మాత్రం మహోజ్వలంగా వెలిగిపోతుందని ఆమె సెలవిచ్చారు.