కరోనా ఎఫెక్ట్..యువ‌త‌కు డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..యువ‌త‌కు డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

March 21, 2020

WHO Warning to Youth on Coronavirus

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు 11వేల మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వృద్ధులకే ఎక్కువ ప్రమాదమని.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతకు ఈ వైరస్ ద్వారా ప్రమాదం లేదని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్‌వో) రంగంలోకి దిగింది. యువ‌తీయ‌వ‌కుల్ని కూడా ఆ మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌లు చేసింది. 

వైర‌స్ వ‌ల్ల టీనేజీ యువ‌త కూడా తీవ్ర అనారోగ్యానికి లోన‌వుతున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అద‌న‌మ్ గేబ్రియాసిస్ తెలిపారు. యువ‌త వ‌ల్లే వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు కూడా డ‌బ్ల్యూహెచ్‌వో అభిప్రాయ‌ప‌డింది. ఈ వైరస్ కారణంగా ఎక్కువ శాతం మంది వృద్ధులే మ‌ర‌ణిస్తున్నా.. వైర‌స్ మాత్రం యువ‌త వ‌ల్ల వివిధ ప్రాంతాల‌కు విస్త‌రిస్తోంద‌న్నారు. మాకేం కాద‌న్న ధోర‌ణితో యువ‌త ఉంటోంద‌ని, కానీ వారి వ‌ల్లే ఆ వైర‌స్ వాళ్ల‌వాళ్ల ఇండ్ల‌ల్లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. వీరి ద్వారానే వృద్దులకు సోకుతున్న‌ట్లు అభిప్రాయపడ్డారు. యువ‌కుల్లో మ‌ర‌ణాల సంఖ్య ఒక్క‌ శాతం క‌న్నా త‌క్కువే ఉన్నా.. వారు ఇంటికే ప‌రిమితం కావాల‌ని ఆదేశాలు జారీ చేస్తున్నారు.