సోషల్ మీడియా స్టార్ హఠాన్మరణం..విషాదంలో ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ మీడియా స్టార్ హఠాన్మరణం..విషాదంలో ఫ్యాన్స్

December 3, 2022

పాపులార్ ఇండో -కెనడియన్ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ హఠాన్మరణం చెందారు. గతవారం కెనడాలో చనిపోయింది. ఈ విషయాన్ని బరువెక్కిన గుండెలతో ఇన్ స్టా‌లో పేరెంట్స్ పోస్ట్ చేశారు.ఈ వార్తతో ఆమె ఫాలోవర్స్ విషాదంలో మునిగిపోయారు. ఎవరీ మేఘా ఠాకూర్..అసలు ఎలా చనిపోయింది?వేలాది మంది సోషల్ మీడియా అభిమానులు ఎందుకు షాక్ అయ్యారు?

లక్షల్లో అభిమానులు

మేఘా ఠాకూర్ 2001లో జన్మించింది. కెనడాలో అంటారియోలోని బ్రాంప్టన్‌లో ఉంటుంది. 21 ఏళ్ల మేఘాకు 93 వేల మంది ట్విట్టర్ ఫాలోవర్స్, లక్షా 2 వేల మంది ఇన్ స్టా ఫాలోవర్స్,9లక్షల మంది ఫాలోవర్లు టిక్ టాక్‌లో ఉన్నారు. నవంబర్ 24న చనిపోయింది.నవంబర్ 29న అంత్యక్రియలు నిర్వహించారు. మేఘా ఎలా చనిపోయిందన్నది ఇప్పటికి సరైన కారణం తెలియలేదు. నాలుగు నెలల ముందు ఆమె మాట్లాడిన ఓ విడియో ఫ్యాన్స్ ని కంటతడి పెట్టిస్తోంది. మేఘాకు నాలుగునెలల క్రితం గుండెపోటు వచ్చింది. ఆమెకు ఏమోవుతుందోనన్న అందరూ కంగారుపడ్డారు. ఈ సమయంలో మోఘా వీడియో పోస్ట్ చేసింది. “నాకు యాంగ్జైటీ ఎక్కువ. దానివల్ల ఒత్తిడి ఎక్కువైంది. ఫలితంగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాను”అని ఆ వీడియోలో ఉంది.

తొలి వీడియోతోనే సంచలనం

కెనడాలోని మేఫీల్డ్ సెకండరీ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత 2019 నుంచి టిక్‌టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది.తొలి వీడియోతో సంచలనం సృష్టించింది. మొదటి వీడియోకు 60 వేల వ్యూస్, 3 వేల లైక్స్ వచ్చాయి. ఒక్క వీడియోతోనే అద్భుతమైన స్టార్‌గా మారింది.

ఏడాది వయస్సులోనే…

మేఘాకు సంవత్సరం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇండియా నుంచి కెనడాకు వెళ్లారు. 2019 వరకు మేఫీల్డ్ సెకండరీ స్కూల్‌లో చదివింది. అక్కడి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెస్ట్రన్ యూనివర్సిటీకి వెళ్లింది.ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. టిక్ టాక్ బాడీ పాజిటివిటీ గురించి అవేర్ నెస్ కల్పి పోస్టులు పెట్టేది. డాన్స్ వీడియోలూ పోస్ట్ చేసింది. జైలీ కన్నర్ , బెల్లా హడిడ్ గురించి ఎక్కువగా మాట్లాడేది.

ఇన్ స్టా లో పేరెంట్స్

మేఘా ఠాకూర్ డెత్‌పై తల్లిదండ్రులు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.”భారమైన మనస్సుతో ఈ విషయం చెబుతున్నాం. మాజీవితాల్లోని వెలుగు ఆకస్మాత్తుగా ,అనుకోకుండా లోకం విడిచి వెళ్లిపోయింది. నవంబర్ 24 ఉదయం ఆకస్మికంగా మేఘా చనిపోయింది. ఏం జరిగిందో తెలియదు తెల్లవారుజామున కన్నుమూసింది “అని రాశారు.

ఫ్యాన్స్ నివాళి

మెఘా మంచి ధైర్యవంతురాలు. ఆత్మవిశ్వాసం, స్వతంత్రభావాలు ఎక్కువ ఉన్న అమ్మాయి. ఇలాంటి ఆమెను కోల్పోవడం దురదృష్టకరం.ఆమె ఆత్మ కలగాలని అందరూ ప్రార్థించాలి అని ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టారు. ఆమె ఎలా చనిపోయిందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 

 

ఇది కూడా చదవండి : అత్యాచార యత్నం.. హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ సస్పెండ్