ప్రొటెం స్పీకర్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నది వీరే..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొటెం స్పీకర్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నది వీరే..!

November 26, 2019

సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించడంతో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలే శాసన సభ్యులు ఎన్నికకావడతో వారిలో ఒక సీనియర్ సభ్యుడికి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ వెంటనే ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలి. దీంతో ఇప్పుడు అక్కడ సీనియర్ ఎవరు ఎవరికి ఈ అవకాశం దక్కుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

సభ్యుల్లో సీనియార్టీ ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనతో పాటు బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు కాళిదాస్ కోలంబ్కర్, రాధాకృష్ణ విఖే పాటిల్, బాబన్‌రావ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేసీ పడవి, ఎన్సీపీ నుంచి దిలీప్ వాల్సే పాటిల్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిపేరును ఫడ్నవీస్ సూచిస్తూ గవర్నర్‌కు నివేదిక పంపనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకే ప్రొటెం స్పీకర్ అవకాశం ఉన్నా సీఎం నిర్ణయం కీలకం కావడంతో ఆయన సంప్రధాయాన్ని కాపాడతారా..? లేక ఆయన విచక్షణ ప్రకారం పేరు సూచిస్తారా అనేది తేలాల్సి ఉంది. 

Supreme.

బల నిరూపణలో ప్రొటెం స్పీకర్ కీలకంగా మారనున్నారు. దీంతో బీజేపీ నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది. కాగా బుధవారం సాయంత్రం 5 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకే రోజు సమయంలో ఉండటంతో మహారాష్ట్రలో రాజకీయ హడావిడి నెలకొంది. అన్ని పార్టీలు తమ సభ్యులకు ప్రత్యేక హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వీరంతా రేపు ఉదయం సభకు నేరుగా హాజరుకానున్నారు.