సెమీ ఫైనల్స్‌కు వెళ్లేదెవరు?: (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సెమీ ఫైనల్స్‌కు వెళ్లేదెవరు?: (వీడియో)

February 4, 2020

folk..

మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం క్వార్టర్ ఫైనల్ రెండో రౌండుకు చేరింది. ఈ రౌండ్స్‌లో 13 మంది తమ పాటలతో అదరగొట్టారు. ‘గట్టెనక గంటెలపొలం ఓ గజ్జెలమోనారె.. గడ్డికొయ్య వస్తనే పిల్లో ఓ గజ్జెలమోనారె..’ అనే ఊపు ఉన్న పాటతో నల్గొండ నుంచి వచ్చిన రాముడు అదరగొట్టేస్తున్నాడు. అలాగే వరంగల్ నుంచి వచ్చిన చిరంజీవి ‘చెవుల కమ్మలు పెట్టుడెంత పిల్లా.. వగలాడి వగలమారి గుమ్మాడి నీ గుణమే గంతా..’ అనే పాటతో మీ ముందుకు వచ్చాడు. చివరగా సిరిసిల్ల నుంచి వచ్చిన బైరగోని చంద్రం ‘జూటమాట కమలతోట దాటిపోతివి అనసూర్య’ అంటూ న్యాయ నిర్ణేతలను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

క్వార్టర్ ఫైనల్స్‌లో ఇది చివరి రౌండు కాబట్టి ఈ ఎపిసోడ్‌తోనే ఎవరు సెమీ ఫైనల్స్‌కు వెళ్లనున్నారో తేలనుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాగాయని విమలక్క, న్యాయ నిర్ణేతలు వరంగల్ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, మురళి మధులకు వీరిలో ఎవర్ని సెమీ ఫైనల్స్‌కు పంపాలి అన్నది పెద్ద టాస్క్‌గా మారింది అని అంటున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో దుమ్ము దులిపిన ఆ 13 మంది కూడా చాలా టెన్షన్‌గా ఉన్నారు. వీరిలోంచి ఎనిమిది మంది సెమీ ఫైనల్స్‌కు వెళ్లనున్నారు. వాళ్లు ఎవరో తెలుసుకోవాలంటే క్రింది లింకులో పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.