ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు తెగింపు, వారసుడు చిత్రాలకు యావరేజ్ టాక్ దక్కింది. తమిళంలో అజిత్, విజయ్ లు పోటాపోటీగా విడుదల చేసిన ఈ రెండు సినిమాలకు అద్దిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక టాలీవుడ్ లో తొలిరోజు వీరసింహారెడ్డికి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తే సెకండ్ డేకి వసూళ్ళలో భారీ డ్రాప్ కనిపించింది. దాంతో బాలయ్య వీరసింహారెడ్డి యావరేజ్ టాక్ మూటకట్టుకుంది. ఇక మొదటిరోజు నుండే బాక్సాఫీస్ ని దున్నేస్తున్న చిత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. గాడ్ ఫాదర్, ఆచార్య చిత్రాలు నిరాశ మిగల్చటంతో వాల్తేరు వీరయ్య కూడా యావరేజ్ అవుతుందేమో అనుకుంటే.. అనూహ్యంగా హిట్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇదే బెస్ట్ ఫిలిం అంటూ టాక్ బయటికొచ్చింది. లాంగ్ రన్ లో వీరయ్య విజృంభిస్తాడని.. సంక్రాంతి విజేత చిరంజీవే అంటూ ప్రచారం స్టార్ట్ అయిపోయింది.
ఇక టాలీవుడ్ లో విడుదలైన నాలుగు పెద్ద చిత్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే.. అఖండ వంటి సూపర్ హిట్ తరువాత విడుదలైన వీరసింహారెడ్డి ఫస్ట్ డేనే 50కోట్లు కొల్లగొట్టి.. బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్యకి మొదటి రోజు 49.1 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తరువాత విడుదలైన వారసుడు మూవీకి 47.52 కోట్ల గ్రాస్ తమిళంలో దక్కింది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైతే మాత్రం వారసుడు ఖచ్చితంగా 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసేది. ఇక అజిత్ తెగింపు అన్నిటికంటే తక్కువగా 41 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తానికి ఈ నలుగురు స్టార్ హీరోలలో మొదటి రోజు కింగ్ గా బాలకృష్ణ నిలిచాడు. అయితే లాంగ్ రన్ లో ఈ హైప్ కలెక్షన్స్ ని ఎవరు కొనసాగిస్తారు అనేదానిని బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.