ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణకు గిరిజనుల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ విగ్రహా గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విగ్రహ ఆవిష్కరణ అక్టోబర్ 31న పధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. అయితే అదే రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నామని, 75 వేల మంది గిరిజనులు ఈ నిరసనలో పాల్గొంటారని గిరిజన నేత డాక్టర్ ప్రపూల్ వసవ తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా 72 గ్రామాల్లోని వేలాది మంది గిరిజనులు జీవనాధారం కోల్పోతున్నారని, వారందరూ రోజు వంట చేసుకోకుండా ఉపవాస దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సాధారణంగా గిరిజనులు ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే గ్రామాల్లో ఇలా వంట చేసుకోరు’ అని ప్రపూల్ తెలిపారు. తమ సహాయ నిరాకరణ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న వంద గిరిజన సంఘాలు మద్దతు పలికాయని, తొమ్మిది గిరిజన జిల్లాల నుంచి ఆందోళనకారులు ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నందునే ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు.