అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీపై బాడీ షేమింగ్ జోరుగా సాగుతోంది. అనంత్, అతని స్నేహితురాలైన రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో జనం నానా కామెంట్లు పెడుతున్నారు. ‘‘డబ్బుంటే సరిపోదు, ఆరోగ్యంగా ఉండాలి. రాధిక అతణ్ని చూసి కాదు, అతని డబ్బును చూసి పెళ్లాడుతోంది. అంత లావు మనిషితో ఏం సుఖపడుతుంది?’ అని అంటున్నారు. మరికొందరు మాత్రం అనంత్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘‘బరువు తగ్గి స్లిమ్‌గా తయారైన అనంత్ మళ్లీ ఇలా బరువెక్కాడంటే ఆరోగ్యం బాలేదని అర్థం. మీ ఇళ్లలోనూ ఇలాంటి స్థూలకాయులు ఉంటారు. వారిని కించపరచకండి. సమస్య పరిష్కారానికి సూచనలు ఇవ్వండి’ అంటున్నారు. అనంత్ బాడీపై ఇంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో అతని ఆరోగ్యం గురించి తల్లి నీతా అంబానీ గతంలో చెప్పిన వివరాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఆస్తా, ఆకలి..
200 కిలోల బరువుండిన అనంత్ చాలా కసరత్తులు చేసి 2016లో 100 కేజీలకు తగ్గాడు. అతని పాత ఫోటోలు, కొత్త ఫోటోలు చూసి అప్పట్లో జనం ఆశ్చర్యపోయారు. ఆ సందర్భంలో నీతా ఏం చెప్పారంటే.. ‘‘నా బిడ్డ ఆస్త్మావ్యాధితో బాధపడుతున్నాడు. దీని చికిత్స కోసం స్టెరాయిడ్స్ వాడాలి. దీనివల్ల బాగా ఆకలవుతుంది. లావు అవుతారు. ఇప్పుడు నా కొడుకు రోజూ ఐదారు గంటలు వ్యాయామం, యోగా, కార్డియో వ్యాయామాలు చేస్తాడు. అనంత్ లాంటి స్థూలకాయులు మన చుట్టూ చాలామంది ఉంటారు. దయచేసి వారిని అవమానించకండి, మానసికంగా కుంగదీయకండి. బరువు తగ్గే సూచనలు ఇవ్వండి’’ అని చెప్పారు. 2017లో స్లిమ్‌గా కనిపించిన అనంత్ స్టెరాయిడ్ల ఫలితంగా మళ్లీ లావైనట్లు అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి :
‘తొక్కినేని’ని తేలిగ్గా తీసిపారేసిన బాలయ్య
హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ పెద్దదే..