ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న కైకాల సత్యనారాయణ మృతి మరువక ముందే నేడు మరో ఘోరమైన వార్త ఇండస్ట్రీని విషాదంలో నెట్టేసింది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు 78 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. ఈ రోజు ఉదయం చలపతిరావు కన్నుమూసిన వార్త విన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెండు రోజుల కింద కైకాల సత్యనారాయణ మృతికి సంతాపం వ్యక్తం చేసిన బాబాయ్ ఇప్పుడు మన మధ్య లేరా అంటూ విలపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చలపతిరావు భౌతిక దేహాన్ని సందర్శించగా.. ‘బాబాయ్ నందమూరి కుటుంబంలో మనిషి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలు పేర్కొన్నారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్లో 600 చిత్రాలకు పైగా నటించారు చలపతిరావు.
అయితే చలపతిరావు కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్లో దర్శకుడు, నటుడు, చిత్ర నిర్మాత. చలపతి కెరీర్ లో సాక్షి (1966), డ్రైవర్ రాముడు (1979), వజ్రం (1995), సల్మాన్ ఖాన్ నటించిన కిక్ (2009) వంటి అనేక చిత్రాలలో చలపతి నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక చలపతిరావు అందరితో చాలా సరదాగా, ఛలోక్తులు విసురుతుంటారు. కానీ ఆయన చిరునవ్వు వెనుక మాత్రం ఎంతో విషాదం దాగి ఉందని అంటుంటారు. ఒక సందర్భంలో మహిళలను ఉద్దేశించి ఓ ప్రెస్ మీట్లో చలపతి రావు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆయనపై ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దాంతో ఆయనకు చాలా బాధ కలిగి సూసైడ్ చేసుకుని చనిపోవాలని కూడా అనుకున్నారట. అయితే కుమారుడు రవి బాబు దగ్గరుండి ఆయన్ని చూసుకుని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటంతో ఆయన తన ప్రయత్నాన్ని మానుకున్నారట. ఇక చలపతి రావుకి ఒకసారి యాక్సిడెంట్ అయితే దాదాపు తొమ్మిది నెలలు బెడ్ కే పరిమితమయ్యాడట.
ఇవి కూడా చదవండి :
జూ.ఎన్టీఆర్ భావోద్వేగం..లే బాబాయ్ అంటూ… వీడియోకాల్ ద్వారా చలపతిరావును చివరిచూపులు
రాత్రి చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా కన్నుమూశారు.. రవిబాబు
‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ
మీ భార్య అమల మమ్మల్ని వేధిస్తుంది.. వీధి కుక్కలని మీ ఇంట్లో వదిలేస్తాం