Why did Chandramohan humiliate Chiranjeevi so much?
mictv telugu

చిరంజీవిని చంద్రమోహన్ ఇంతలా కించపరిచాడేంటీ ?

December 6, 2022

వివాదాలకు దూరంగా ఉంటాడని పేరున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవిపై చంద్రమోహన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మెగా అభిమానులకి ఆగ్రహం తేప్పిస్తున్నాయ్. ఇప్పటికే అల్లు ఫ్యామిలీతో మెగా హీరోలకి మనస్పర్థలు ఉన్నాయని పుకార్లు ఉన్న సమయంలో చంద్రమోహన్ వ్యాక్యాలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. విలన్ వేషాలతో కెరీర్ స్టార్ట్ చేసి.. మెగా స్టార్ అయినా చిరంజీవి ప్రయాణాన్ని ఇండస్ట్రీ వారంతా స్ఫూర్తిగా తీసుకుంటారు. మూస పద్ధతిలో వెళ్తున్న టాలీవుడ్ కి గ్లామర్ టచ్ ఇచ్చిన ఘనత చిరంజీవిదే అంటారు. బాలీవుడ్ హీరోలకు కూడా చేతకాని డాన్సులు, రియలిస్టిక్ ఫైట్స్ తెరపై తొలిసారి చూపెట్టింది చిరునే. తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్ ని అమాంతం పెంచింది కూడా మెగాస్టారే. ఇక 90sలో ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి అంటూ ప్రముఖ బాలీవుడ్ మ్యాగజిన్ ఫిలిం ఫేర్ సైతం ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ రాసింది.

అయితే ఇదంతా మెగాస్టార్ స్వయం కృషి మాత్రమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ట్యాలెంట్ తో పైకొచ్చారు చిరంజీవి. మెగాస్టార్ సామర్థ్యం చూసే అల్లు రామలింగయ్య అల్లుడిని చేసుకున్నారని.. చిరంజీవి అల్లుడయ్యాకే అల్లు కుటుంబం భారీగా సంపాదించింది అని కూడా కొందరి వాదన ఉంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషిని అవమానించేలా చంద్రమోహన్ తాజాగా కామెంట్స్ చేశాడు. ‘మా రోజుల్లో చిరంజీవిని మహాభారతంలోని అర్జునుడుగా సంబోధించే వాళ్లం. అయితే శ్రీకృష్ణుడు లేకుంటే భారతాన అర్జునుడు లేడు. అలాగే అర్జునుడు చిరంజీవి, శ్రీకృష్ణుడు అల్లు అరవింద్ అని పేర్కొన్నారు. ఓ సినిమా అంగీకరించే సమయంలో ఏ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి పని చేయాలి?.. ఎంత పారితోషికం తీసుకోవాలి ఎలాంటి పాత్రలని ఎంచుకోవాలి వంటి సలహాలు అల్లు అరవింద్ ఇచ్చేవాడని , అల్లు అరవింద్ సహకారం సలహాల వల్లే చిరంజీవి మెగా స్టార్ గా నిలబడ్డారు’ అంటూ నటుడు చంద్రమోహన్ పరోక్షంగా వెల్లడించడం మెగా అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తుంది.