తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది. భారతదేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. తెలుగువాళ్ళ ఆనందానికి అయితే హద్దే లేదు. అయితే దీనంతటి వెనుకా ఎవరున్నారు? ఎవరి కష్టం వల్ల మనకు ఆస్కార్ వచ్చింది? కీరవాణి కార్తికేయకు ఎందుకు థాంక్స్ చెప్పాడు?
నాటునాటు సాంగ్ కు ఆస్కార్ రావడం వెనుక చాలా పెద్ద కష్టమే ఉంది. ఈ సినిమాను ఆస్కార్ ఎంట్రీస్ కు పంపింది ఇండియన్ గవర్నమెంట్ కాదు. ఈ విషయం పొద్దుట తలసాని శ్రీనివాస యాదవ్ కూడా చెప్పారు. ఆస్కార్ కు 80 కోట్లు ఖర్చు పెట్టారని గత రెండు, మూడు రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ కష్టం అంతా ఎవరిది అంటే టోటల్ క్రెడిట్ గోస్ టూ కార్తికేయ. ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కు పంపడం దగ్గర నుంచీ అవార్డ్ వచ్చేవరకూ పడ్డ ప్రతీ చిన్న కష్టం కార్తికేయ ఎఫర్ట్సే.
అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి ఎమోషనల్ అవుతూ… తాను కార్పెంటర్స్ అనే అమెరికన్ మ్యూజిషియన్స్ సంగీతం వింటూ పెరిగానని చెబుతూనే వారి పాటలోనే తాను రాజమౌళి కుటుంబం ఇక్కడికి వచ్చి ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలగన్నామని అది ఇప్పుడు నిజమైందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజమౌళికి కానీ సినిమాలో నటించిన నటీనటులకు లేక పాడిన వారికో థాంక్స్ చెబుతారు అనుకుంటే… అదేది లేకుండా రాజమౌళి కుమారుడు కార్తికేయకు థాంక్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.అసలు ఇలాంటి ఆస్కార్ వేదిక మీద కార్తికేయకు కీరవాణి ఎందుకు థాంక్స్ చెప్పాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. అదే ఆస్కార్ వెనుక జరిగిన కథ తెలుసుకోవడానికి దారి తీసింది.
రాజమౌళి రమా దంపతుల కుమారుడే కార్తికేయ. వాస్తవానికి కార్తికేయ రమా రాజమౌళి రాజమౌళి ఇద్దరికీ జన్మించలేదు. రమాకు మొదటి వివాహం ద్వారా పుట్టిన కొడుకు కార్తికేయ. రాజమౌళి రమను వివాహం చేసుకున్న తర్వాత తన సొంత బిడ్డ లాగా అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు.కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రొడక్షన్ విభాగంలో అన్ని తానే వ్యవహరించారు. ఇండియాలో ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసేందుకు ప్రముఖ పాత్ర కూడా తనే పోషించాడు. భారత్ తరపున అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో జనరల్ కేటగిరీలో ప్రైవేటుగా ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ కి పంపే క్యాంపైన్ చేసి అమెరికాలో ఈ సినిమాని కొన్న వేరియన్స్ ఫిలిమ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో… గోల్డెన్ గ్లోబ్ ఆ తర్వాత ఆస్కార్ అవార్డుల సైతం ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు లభించాయి. దీనికి కార్తికేయ చాలా కష్టపడ్డాడని టాక్. అందుకే కీరవాణి కార్తికేయకు అంత స్పెషల్ గా థాంక్స్ చెప్పాడని అంటున్నారు.