why director anudeep slapped faria abdullah in shooting
mictv telugu

జాతిరత్నాలు హీరోయిన్‌ను కొట్టిన డైరెక్టర్.. అసలేంటీ గొడవ ?

November 2, 2022

ఫరియా అబ్దుల్లా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. గతేడాది ‘జాతిరత్నాలు’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ క్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుండగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తుంది హీరోయిన్ ఫరియా. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీ హోస్ట్ చేసే ఒక షోకి వెళ్లిన ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటపెట్టింది. జాతి రత్నాల షూటింగ్ ఎక్స్ పీరియన్స్, చిత్ర దర్శకుడు అనుదీప్‌ గురించి చెప్పలాంటి అలీ అడిగిన ప్రశ్నకు ఎలాంటి తడబాటు లేకుండా క్లారిటీగా సమాధానమిచ్చింది ఫరియా.

ఇక నిన్ను డైరెక్టర్ అనుదీప్ కొట్టారట కదా అని అలీ ఫరియాని అడగ్గా.. ” అది సరదాగా జరిగింది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయనకు అలవాటు. అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు. అంతే అది అలా ;పబ్లిసిటీ అయిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులోని మాటలను బయటపెట్టింది ఫరియా. ఇక ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదల కానుందని అందరు ఆదరించాలని కోరుకుంది.