వేధించే వెక్కిళ్లు.. ఇలా చేస్తే మటుమాయం! - MicTv.in - Telugu News
mictv telugu

వేధించే వెక్కిళ్లు.. ఇలా చేస్తే మటుమాయం!

July 11, 2019

Tips for decreasing.

భోజనం చేసేటప్పుడు వెక్కిళ్లు వస్తే ఎవరు గుర్తు చేసుకున్నారో అని అనుకుంటారు. మూడు గానీ, ఏడు గుటకల మంచినీళ్లు తాగితే అవి పోతాయి అనుకుంటారు. భోజనం మధ్యలో వెక్కిళ్లు మానడానికి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల వాటితోనే కడుపు నిండిపోతుంది. అయితే ఈ వెక్కిళ్లు ఎవరో గుర్తు చేసుకుంటే వస్తాయన్నది మన మూఢ నమ్మకమే. శరీరంలోని డయాఫ్రంలో మార్పుల వల్ల వెక్కిళ్లు వస్తాయని సైన్స్ చెబుతోంది. ఛాతిని, ఉదరభాగాన్ని వేరుపరిచే డయాఫ్రం చాలాసార్లు సంకోచించడం వల్ల వెక్కిళ్లు వస్తాయి.

వేగంగా తినడం, ఎక్కువ సేపు బిగ్గరగా నవ్వడం, అతిగా మద్యం తాగడం, నరాల జబ్బులు, కాన్సర్‌ మందులు వాడేవారికి వెక్కిళ్లు వస్తాయి. వెక్కిళ్లు రాగానే గబగబా నీళ్లు తాగుతుంటారు. అలా తాగకుండా కొద్దికొద్దిగా నీరు తాగితే ఫలితం వుంటుంది. 

 

వెక్కిళ్లు తగ్గాలంటే కొన్ని చిట్కాలు..

 

ప్రాణామాయంలాగా ఊపిరి కొద్దిసేపు బిగపట్టి వదులుతూ ఉండాలి. 

 

ఒక టీ స్పూన్‌ వినెగార్‌ గాని వంటసోడాగాని నీళ్లలో కలిపి తాగాలి. 

 

ఒక సీసా తీసుకుని అందులోకి గాలి ఊది, నోటిని తియ్యకుండా అదే గాలిని పీల్చి మళ్లీ అందులోనే ఊదుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తంలో కార్బన్‌డయాక్సైడ్‌ శాతం పెరిగి వెక్కిళ్లు నిలిచిపోతాయి. 

 

చక్కెర కలిపిన నీళ్లు నాలుకపైన కానీ, కిందగాని కొద్దిసేపు ఉంచుకోవాలి. 

 

రోగి నాలుకకు చేతిరుమాలుతో పట్టుకుని మెల్లగా బయటకులాగి వదలాలి. 

 

వెక్కిళ్లు వచ్చినవారిని అకస్మాత్తుగా భయాందోళనలకు గురిచేయడం వల్ల కూడా వెక్కిళ్లు ఆగిపోతాయి.