Why do most hotels, trains use white bedsheets?
mictv telugu

తెల్లని బెడ్ షీట్స్ ఎందుకు వేస్తారు?

December 24, 2022

 

Why do most hotels, trains use white bedsheets?

మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారా? అయితే మీరు హోటల్స్, రైళ్లలో తెల్లని బెడ్ షీట్స్ పరుస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?
రంగు రంగుల బెడ్ షీట్స్ ఉండగా.. హోటల్స్, రైళ్లలో ఎందుకు తెల్లని బెడ్ షీట్స్ వేస్తారో మీకు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? పరిశ్రమ నిపుణులు, వ్యాపార ఇంటీరియర్ డిజైనర్ల ప్రకారం.. హోటల్ గది వస్త్రాల కోసం తెలుపు రంగును ఎంచుకోవడానికి అనేక నమ్మకమైన కారణాలు ఉన్నాయి. హోటళ్లలో మరకలు ఎక్కువగా అవుతాయి. అలా అని రంగుల బెడ్ షీట్లు వేసినప్పుడు ఆ మరకలు కనపడకుండా పోతాయి. ఉతికినప్పుడు అవి పోతున్నాయో లేదో కూడా అర్థం కాదు. అందుకే తెల్లని మీద దుమ్ము సులభంగా గుర్తించి ఉతుకడానికి ఈజీగా ఉంటుంది.

కొందరికీ పూల బెడ్ షీట్స్ నచ్చుతాయి. మరికొందరికి వేరే ప్యాటర్న్ ల గురించి ఆలోచిస్తారు. చిన్నా, పెద్ద.. ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ మెచ్చే రంగు తెలుపు. ఈ తెలుపు రంగు ఒత్తిడి నివారిణిగా పరిగణించబడుతుంది. పర్యాటకులకు విశ్రాంతినిస్తుంది. సానుకూలంగా అనిపిస్తుంది. ఇది ఒక కారణం మాత్రమే. ఇంకో కారణం ఏంటంటే.. రైల్వేలు, హోటల్లు.. బెడ్ షీట్స్ ను శుభ్రం చేయడానికి బ్లీచ్ చేస్తారు. దీనివల్ల రంగు బెడ్ షీట్స్ ఫేడ్ అవుతాయి. తెల్లని బెడ్ షీట్స్ ఏం పాడు కావు. పైగా మరింత బెడ్ షీట్స్ ని తెల్లగా చేస్తుంది. అందుకే రంగు బెడ్ షీట్స్ కంటే తెల్లని బెడ్ షీట్స్ కి ప్రాధాన్యం ఎక్కువ.

వెస్టిన్ హోటల్లు 1990ల్లో వైట్ హోటల్ లినెన్లను మొదటిసారిగా వాడారు. గ్లోబల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్ అయిన లెస్ రోచెస్ ప్రకారం.. మొత్తం తెల్లగా ఉండడం వల్ల పర్యాటకులు అవి మరింత విలాసవంతమైనదిగా భావిస్తారు. అంతేకాదు.. మంచి నిద్ర పట్టడానికి కూడా ఈ తెల్లని బెడ్ షీట్స్ వాడకం పెంచారు. అయితే కేవలం వీటితో ఆపకుండా టవల్స్, బాత్ రోబ్ లకు కూడా తెల్లని రంగులవే వాడడం మొదలు పెట్టారు.