Why Ileana Not Getting Chances
mictv telugu

గోవాలో ఆ పనులు చేస్తూ.. ఘోరంగా ఇలియానా పరిస్థితి..!

January 7, 2023

Why Ileana Not Getting Chances

ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది గోవాబ్యూటీ ఇలియానా. పోకిరితో కుర్రకారుని షేక్ చేసి పడేసింది. తన నడుమందాలతో మతిపోగొట్టింది ఇలియానా. పవన్ కళ్యాణ్ తో జల్సా, మహేష్ బాబు పోకిరి, ప్రభాస్ మున్నా, ఎన్టీఆర్ రాఖీ, అల్లు అర్జున్ తో జులాయి.. ఇలా ఇల్లీబేబితో నటించిన స్టార్ హీరో లేడనే చెప్పొచ్చు. టాలీవుడ్ లో పీక్ స్టేజిలో ఉన్నప్పుడే ఇలియానా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఆమె కెరీర్ నే మార్చేసింది. వరుసగా టాలీవుడ్ ఆఫర్స్ తో ఉన్నత శిఖరంలో ఉన్న ఇలియానా సడెర్న్ గా తెలుగు చిత్ర పరిశ్రమని వదిలేసింది.

కారణమేంటో తెలియదు కానీ టాలీవుడ్ కి రామ్ రామ్ చెప్పేసి.. బాలీవుడ్ కి జై కొట్టేసింది. కేవలం హిందీ సినిమాలపైనే అంటూ ముంబైకి మకాం మార్చేసింది. ఇదే ఇల్లీబేబి కి కాస్లీ మిస్టేక్ అయిపోయింది. బాలీవుడ్ కి వెళ్లినా అక్కడ పెద్దగా ప్రయోజనం లేదు. ఎదో మిడిల్ బడ్జెట్ చిన్న చిత్రాలు, సెకండ్ రేంజ్ హీరోలు, సైడ్ పాత్రలే ఇలియానాకి దక్కాయి. ఒక దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అలియాభట్ వంటి హీరోయిన్స్ లా మాత్రం క్రేజ్ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక బీ గ్రేడ్ మూవీ కూడా చేస్తుందని ఇలియానాపై టాక్ ఉంది. గోవా బీచ్ లో డ్రగ్స్ స్మగ్లర్ పాత్రలో.. టూరిస్టులని అందాలతో ట్రాప్ చేసే లేడి రోల్ చేస్తుందట ఇలియానా.

అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానాకి స్టార్ స్టేటస్ కాదుకదా ఇప్పుడు కనీసం చేతిలో ఒక్క మంచి సినిమా కూడా లేదు. దీంతో తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమపై ఇల్లీబేబి చూపు పడింది. తరచుగా టాలీవుడ్ పీఆర్వో లతో టచ్ లోకి వెళ్తుందట ఇలియానా. ప్రస్తుతం హీరోయిన్ గా కాదు కనీసం స్పెషల్ ఐటం సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా చేస్తానని అంటుందట ఇలియానా. ఆ ఛాన్స్ లు కూడా ఇచ్చేందుకు రెడీ గా లేరు మన వాళ్లు. ఎలాగు ఆమె పాపులారిటీ తగ్గింది కాబట్టి ఐటం సాంగ్ చేసినా పెద్దగా క్లిక్ అయ్యే ఛాన్స్ లేదని వారి ఆలోచన. ఇక మళ్లీ ఇలియానాని తెలుగు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇల్లి బేబ్ కూడా అందుకు రెడీ అంటున్నా ఇక్కడ దర్శక నిర్మాతలే అమ్మడికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో చేసిన చాట్ లో అవసరమైతే స్పెషల్ సాంగ్స్ అయినా చేస్తానని అన్నది ఇలియానా.