Home > Featured > ఎవరూ చేయని సాహసం..చంద్రయాన్-2లో ఎన్నో ప్రత్యేకతలు

ఎవరూ చేయని సాహసం..చంద్రయాన్-2లో ఎన్నో ప్రత్యేకతలు

Chandrayaan 2 ..

చంద్రయాన్-2 ప్రయోగంలో జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగకపోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రయోగం గురించి చర్చించుకుంటున్నాయి. ప్రయోగం విజయవంతం కాకపోయినా భారత్ గొప్ప అడుగు వేసిందనే ప్రశంసలు వస్తున్నాయి. దాదాపు చంద్రుడిని చేరుకునేంత వరకు వెళ్లి చివరి క్షణంలో సాంకేతిక లోపం రావడంతో ప్రయోగం నిలిచిపోయింది.

వాస్తవానికి ప్రపంచ దేశాలు చేయలేని సాహసాన్ని ఇస్త్రో శాస్త్రవేత్తలు చేశారు. చంద్రుడిపై ఇప్పటి వరకు ఎన్నో దేశాలు ప్రయోగాలు చేశాయి. కానీ అవి ఉత్తర ధృవం వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ భారత శాస్త్రవేత్తలు అన్నిటికి భిన్నంగా దక్షిణ ధృవం వైపు ఏముంది, అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ఉపక్రమించారు. ఎంతో ముందు చూపుతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ప్రయోగం ఎందుకంటే :

దక్షిణ ధృవంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి సూర్య కిరణాలు పడటం లేదు. దీంతో అక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇస్త్రో భావించింది.

వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి వెలుగు పడకపోవంతో సౌరవ్యవస్థకు సంబంధించిన ఆధారాలను సేకరించవచ్చని భావించారు. దీంతో పాటు హైడ్రోజన్ మిథేన్, అమ్మోనియా మూలలు ఉండవచ్చని అంచనా వేశారు.

ఒకవేళ దక్షిణ ధృవంలో నీటి జాడ కనుక గుర్తిస్తే మానవ సహిత యాత్రలకు దాన్ని బేస్ స్టేషన్‌గా చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగం చేపట్టారు.

మొత్తానికి ప్రయోగం విజయవంతం కాకపోయినా ఎవరూ చేయని పనికి ఓ ముందడుగుగానే భావించాలని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 7 Sep 2019 1:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top