అందరు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపుకు చేరుకుంది. నవ్వులు, కన్నీళ్లు, అరుపులు ఇలా పలు భావోద్వేగాలతో నడిచిన బిగ్ బాస్ ఈరోజే ఎండ్ కాబోతుంది. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజేత ట్రోఫీని ఎవరు ఇంటికి తీసుకెళ్తారో తేలిపోనుంది. ట్రోఫీ, ప్రైజ్ మనీతో పాటు.. విజేతకు రూ. 25 లక్షల విలువైన ప్లాట్ బోనస్ బహుమతిగా లభించనుంది. OTT బిగ్ బాస్ ఎడిషన్ ముగిసిన వెంటనే బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభమైంది. 21 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ సీజన్ హోస్ట్‌గా టాలీవుడ్ స్టార్ నాగార్జునే వ్యవహరించారు. 100 రోజులకు పైగా నడిచిన ఈ షోలో ఎన్నో ఎలిమినేషన్స్ తరువాత ఐదుగురు ఆశావహులు అగ్ర బహుమతి కోసం పోటీ పడ్డారు. మొదటి ఐదు స్థానాల్లో రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్ సాహ్నిలు నిలిచినట్టు లీక్స్ అందుతున్నాయి. అయితే ఐదుగురు కంటెస్టెంట్స్ లో మహిళ కంటెస్టెంట్ కీర్తి టైటిల్ రేసులో ముందంజలోనే కొనసాగింది. కానీ ఈ సారి కూడా మహిళకు బిగ్ బాస్ లో అన్యాయం జరిగినట్టే కనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్.. రన్నరప్ గా శ్రీహాన్ పేర్లు వినపడుతున్నాయి.
ఇక ఇప్పటివరకు గడిచిన ఐదు సీజన్లలో ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ గా నిలవలేదు. కేవలం నాన్ స్టాప్ షోలో మాత్రమే బిందు మాధవి విజేతగా నిలిచింది. కానీ స్ట్రైట్ టెలివిజన్ షోలో మాత్రం గెలవలేకపోయింది. ఆ మధ్య మూడవ సీజన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పోటీపడి చివరి రౌండులో ఓడిపోయింది శ్రీముఖి. ఇక ఈ సారి టాప్ టెన్ లో నిలిచిన అమ్మాయిలలో ఎవరైనా గెలుస్తారేమో అని ముందు అందరు అనుకున్నా.. ఆశలు అడియాశలు అయ్యాయి. ఇనయా సుల్తానా, శ్రీ సత్య, కీర్తి ఈ ముగ్గురు అబ్బాయిలతో పోటీపడ్డా.. టైటిల్ నెగ్గలేకపోయారు. ముఖ్యంగా టాప్ 5లో నిలిచిన కీర్తిపై మహిళ లోకం భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కీర్తికి సీజన్ 6లో మూడవ స్తానం వచ్చినట్టు సమాచారం. ఈ సీజన్ లో అయినా అమ్మాయిలు ఎవరైనా గెలుస్తారేమో అనుకుంటే ఎవరూ కూడా చివరి దశ వరకు సరైన పోటీని ఇవ్వలేదు. మరి నెక్స్ట్ సీజన్ లో అయినా ఎవరైనా అమ్మాయిలు బిగ్ బాస్ టైటిల్ అందుకుంటారో లేదో చూడాలి.