why naga chaitanya silent on samantha health condition
mictv telugu

సమంతకి మద్దత్తుగా టాలీవుడ్.. కానీ నాగ చైతన్యకి మాత్రం మనసు రావటం లేదా ?

October 30, 2022

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంతపై సోషల్ మీడియాలో పరామర్శల వర్షం కురుస్తుంది. యావత్ టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోలు గెట్ వెల్ సూన్ అంటూ మెసేజిలు పెడుతున్నారు. ఇక వివాదాలన్నింటిని పక్కన పెట్టి తన మాజీ వదినకు అక్కినేని అఖిల్ సైతం దైర్యం చెప్పాడు. ‘డియర్ సామ్ దైర్యంగా ఉండండి. మీ అభిమానుల ప్రేమే మీకు దైర్యం’ అంటూ అఖిల్ సంచలన ట్వీట్ చేశాడు. అయితే సమంత అనారోగ్యంపై మొదట నాగ చైతన్య ట్వీట్ చేస్తాడని అంతా ఊహించారు. కానీ విచిత్రంగా అక్కినేని కుటుంబం నుండి అఖిల్ మొదటగా స్పందిస్తూ షాక్ ఇచ్చాడు. అయితే సమంత అనారోగ్యంపై చైతు స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.

శత్రువుల ఆరోగ్యం బాలేకున్నా మనం వెళ్లి పరామర్శిస్తాం. ఇది మన సంప్రదాయం. అలాంటిది తన మాజీ భార్య సమంత మయోసైటిస్ అనే భయంకర వ్యాధితో బాధ పడుతున్నా చైతు స్పదించకపోవటాన్ని తప్పు పడుతున్నారు నెటిజన్స్. వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. కొన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అంతకు ముందు కలిసి నటించారు కూడా. భార్యా భర్తలుగా విభేదాలు ఉన్నా
సామ్ చేలు మంచి స్నేహితులు. ఆ స్నేహం, ప్రేమ, పెళ్లి అన్ని బంధాలని మరిచి నాగచైతన్య కనీసం స్పందించకపోవటం బాధకరమంటున్నారు నెటిజన్స్. పెళ్లి బంధానికి విడాకులు తీసుకున్నా స్నేహితులుగా కలిసుందామని.. డివోర్స్ సమయంలో చైతు చెప్పిన మాటలు ఒట్టి కబుర్లే అని.. అఖిల్ కి ఉన్న మంచి మనసు చైతూకి లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ చైతు కలిసి ఉండాలని ఇంకా కోరుకునే కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ‘ప్లీజ్ చైతు.. మా సామ్ తో ఒకసారి మాట్లాడవా’ అంటూ వేడుకుంటున్నారు. చూద్దాం మరి అభిమానుల కోరికని చైతు మన్నిస్తాడో లేదో.