నెట్‌ఫ్లిక్స్‌కు రూ. 11 వేల కోట్ల నష్టం.. పాస్‌వర్డ్ షేరింగ్‌తో  - MicTv.in - Telugu News
mictv telugu

నెట్‌ఫ్లిక్స్‌కు రూ. 11 వేల కోట్ల నష్టం.. పాస్‌వర్డ్ షేరింగ్‌తో 

November 6, 2019

Netflix ...

ఒరిజినల్ కంటెంట్‌తో భారతీయుల మన్ననలు పొందుతున్న నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఏటా 11 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు సంస్థ ప్రకటించింది. పాస్‌వర్డ్ షేరంగే తమ కొంప ముంచిందని చెబుతోంది. తన కస్టమర్ల సంఖ్యను పెంచుకునే క్రమంలో పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్ పెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను అనేకమంది వీక్షించేందుకు వీలుగా  పాస్‌వర్డ్ షేరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఓ వ్యక్తి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే..అతడి పాస్‌వర్డ్ సహాయంతో అతడి స్నేహితులు ఈ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించడమే పాస్‌వర్డ్ షేరింగ్. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ఇదే తమకు తీవ్ర నష్టాల్లోకి నెడుతోందని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల్లో దాదాపు 10% మంది పాస్‌వర్డ్ షేరింగ్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగిస్తున్నారని  మాగిడ్ అనే అనలిటిక్స్ సంస్థ సర్వే తేల్చింది. దీంతో సంస్థకు ఏటా దాదాపు 11 వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ‘దీనిపై మేము దృష్టి సారించాం. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలా అనే విషయంపై యోచిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఈ దిశగా చర్యలు తీసుకునే ఉద్దేశం మాకు లేదు’ అని స్పష్టంచేశారు.