ఇన్ని రోజులు ఎందుకు నమాజ్ చేయలేదు? బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇన్ని రోజులు ఎందుకు నమాజ్ చేయలేదు? బండి సంజయ్

June 2, 2022

చార్మినార్‌లో నమాజ్ చేయడం కోసం సంతకాల సేకరణ చేస్తున్న స్థానిక కాంగ్రెస నేత రషీద్ ఖాన్‌పై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి అమ్మవారి మీద చేయి వేయాలని సవాలు విసిరారు. ‘హిందువులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే మీకు ఇప్పుడు నమాజ్ గుర్తుకు వచ్చిందా? ఇన్ని రోజులు నమాజ్ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి డ్రామాలాడుతున్నాయి. చార్మినార్ వద్ద ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారిని మచ్చిక చేసుకొని ఒవైసీ తన అవినీతిని బయటకు రానీయడం లేదు. ముస్లిం మైనార్టీ ఓట్లను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ‘సంతకాల సేకరణ చేస్తున్న వారిని ముస్లిం సమాజం కూడా హర్షించదు. ఇలాగైతే మేం కూడా సంతకాల సేకరణ చేయాలా? అదే గనుక జరిగితే రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది. రషీద్ ఖాన్‌కు సిగ్గుందా? వెంటనే ఆయనపై సుమోటో కేసు వేసి అదుపులోకి తీసుకోవాలి. అయినా చార్మినార్ పాతబడిపోయింది. శిథిలావస్థకు చేరుకుంది. అందుకే దాని పక్క నుంచి పెద్ద వాహనాలను అనుమతించడం లేదు. అనుమతిస్తే చార్మినార్ కూలిపోయే ప్రమాదముంది’ అని అభిప్రాయపడ్డారు.