Home > Featured > ఎన్టీఆర్ కి షాక్.. ఆస్కార్ నుండి ఎవరు తప్పించారు ?

ఎన్టీఆర్ కి షాక్.. ఆస్కార్ నుండి ఎవరు తప్పించారు ?

Why Ntr Missed In Oscar Nominations

ప్రతి తెలుగ్గోడు వేయి కళ్ళతో ఎదురుచూసిన క్షణాలు. దేశ వ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ. రెండు రోజుల క్రితం అమెరికన్ టుడే వెబ్ సైట్ ప్రెడిక్షన్స్ తరువాత దేశం చూపంతా ఎన్టీఆర్ వైపే. యూఎస్ టుడే ఆస్కార్ ప్రెడిక్షన్స్ లిస్టులో ఎన్టీఆర్ టాప్ లో నిలిచాడని… దిగ్గజ హాలీవుడ్ హీరోలని దాటి ఎన్టీఆర్ కే భారీ ఓటింగ్ వచ్చిందని.. ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు రావటం లాంఛనమే అని భావించారు. దాంతో ఈ రోజు మంగళవారం సాయంత్రం అందరు టీవీలకు అతుక్కుపోయారు. అందరి చూపు ఆస్కార్ ఫలితాలపైనే. కానీ ఎన్టీఆర్ పేరు ఆస్కార్ నామినేషన్ లో కనిపించలేదు. బెస్ట్ యాక్టర్ క్యాటగిరిలో ఎన్టీఆర్ పేరు లేకపోవటంతో అందరు షాక్ అయిన పరిస్థితి. అయితే అవార్డు గ్యారెంటీ అనుకున్నా ఎందుకిలా జరిగిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త సెర్చ్ చేస్తే కొన్ని ఆసక్తికరణ సమాదానాలు వచ్చాయట.

రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ ఎన్టీఆర్ అవార్డుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదట. నాటు నాటు పాటపై నమ్మకంతో దాన్నే ఎక్కువగా ప్రమోట్ చేశారట. మొదట ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్స్ ఓటింగ్ పడినా.. విదేశీయుల ఓట్ల శాతం ఆఖరిలో భారీగా తగ్గిందట. అయితే ఈ ఓటింగ్ ప్రకారం అవార్డు కేటాయించకపోయినా.. క్రిటిక్స్ దృష్టిని పెద్దగా ఆకట్టుకోవడానికి మాత్రం ప్రమోషన్స్ పనికొస్తాయి. అయితే ఎందుకనో ఆర్ఆర్ఆర్ టీమ్ ఫోకస్ అంతా నాటు నాటుపై పెట్టడంతో అనూహ్యంగా ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచింది ఈ సాంగ్. ఎన్టీఆర్ పై అమెరికా మ్యాగజైన్ కి ఉన్న నమ్మకం మనకి లేకపోయింది అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికిగాను ఆయనకు ఉత్తమ నటుడు లేదా ఉత్తమ సహాయనటుడు నామినేషన్లలో ఏదో ఒకటి దక్కుతుందని బలంగా నమ్మిన ఫ్యాన్స్ కి ఇది పూర్తి నిరాశ కలిగించే అంశం.

Updated : 24 Jan 2023 10:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top