ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బహుశా ఇండియాలోనే ఇంతటి రెమ్యునరేషన్ ఏ హీరో తీసుకోరు. బాలీవుడ్ ఖాన్స్ సైతం 100కోట్ల లోపే పారితోషకం తీసుకుంటారు. అయితే వారికి సినిమాల్లో వాటాలు ఉంటాయి. ఏదేమైనా బాలీవుడ్ టు టాలీవుడ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తాజాగా 21కోట్ల బ్యాంక్ లోన్ తీసుకున్నాడన్న వార్త ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన ఓ బ్యాంక్ నుంచి రూ. 21 కోట్ల రుణం తీసుకున్నట్లుగా ఈ వార్తలలోని సారాంశం. ప్రభాస్ ఏంటి? బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం ఏమిటి? వింటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదా. కానీ ఇది నిజమే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం విశేషం.
ప్రస్తుతం డార్లింగ్ నాలుగు సినిమాలని ఏకధాటిగా చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ ప్రభాస్ లిస్టులో ఉండగా.. ఈ నాలుగు చిత్రాల మార్కెట్ కి అనుగుణంగా తక్కువలో తక్కువ 500కోట్ల రెమ్యునరేషన్ ఖచ్చితంగా ప్రభాస్ కి వస్తుంది. మరి సంపాదనలో బాహుబలిగా ఉన్న ప్రభాస్ కి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం ఏంటనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. తన ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంక్ నుండి ప్రభాస్ 21కోట్లు లోన్ గా తీసుకున్నాడని.. ఆ బ్యాంక్ చెక్ సైతం తాజాగా ప్రభాస్ కి చేరిందని అంటున్నారు. అయితే ఇదంతా క్యాష్ లేక కాదు.. తన ఇల్లుని ఎవరు కబ్జా పెట్టకుండా చేయడానికే అంటున్నారు. ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి. ప్రభాస్ ఏ కారణంతో లోన్ తీసుకున్నాడో అది ఆయన వ్యక్తిగతం అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ప్రభాస్ లాంటి కటౌట్ ఇల్లునే కబ్జా చేసే సాహసం ఎవరు చేస్తారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.