why revanth avoiding media interviews
mictv telugu

విజేతగా నిలిచినా.. విలువ లేదా ?

December 24, 2022

why revanth avoiding media interviews

తెలుగు బిగ్ బాస్ ఇటీవల ముగియగా.. ఈ సారి సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ కి టైటిల్ దక్కింది. రన్నరప్ గా శ్రీహన్ నిలిచాడు.
భారీ ఉత్కంఠత మధ్య నాగార్జున బిగ్ బాస్ విజేతని ప్రకటించాడు. మ్యాచ్ ఫిక్స్ అయినట్టుగానే సింగర్ రేవంత్ విన్ అయ్యాడు. దాంతో ఎప్పటిలానే షోపై ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ లోకి ఎంట్రీ నుండే రేవంత్ ని విన్నర్ గా బిగ్ బాస్ ప్రోజెక్ట్ చేసిందని.. మిగితా కంటెస్టెంట్స్ కంటే రేవంత్ పై ఫోకస్ ఎక్కువగా పెట్టిందని విమర్శలు వస్తున్నాయి. ఇక రేవంత్ కి పోటీ ఉండకూడదని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేసేశారని.. రేవంత్ కోసం మిగితా సభ్యులని బకరా చేయటంపై మండిపడుతున్నారు నెటిజన్స్. ముఖ్యంగా రేవంత్ కంటే ఎక్కువ ఓట్లు దక్కిన శ్రీహన్ ఫ్యాన్స్ అయితే రేవంత్ ని ఒక ఆడుకుంటున్నారు. ఈ కారణంగానే విజేతగా నిలిచినా రేవంత్ మీడియాకి దూరంగా ఉంటున్నాడని.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూస్ ఇస్తే.. తనకి ప్రశ్నల వర్షం కురుస్తుందని భయపడే రేవంత్ బయటికి రావటం లేదని శ్రీహన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఇక బయట లక్షల అభిమానులని పెట్టుకుని.. బిగ్ బాస్ తో జరిగిన ఒప్పందంతోనే రేవంత్ విన్ అయ్యాడని.. కానీ అసలు విన్నర్ మా శ్రీహన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే రేవంత్ మొహం చాటేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విమర్శలని రేవంత్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. తన పాప కోసమే రేవంత్ ఇంటర్వ్యూలకి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. భార్య ప్రెగ్నెన్సీ ఉన్న టైంలోనే రేవంత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే పాప పుట్టిన టైం లో కూడా ఆమెకు తోడుగా లేరు. అందుకే ప్రస్తుతం ఆమెకు తోడుగా ఉంటూ తన పాపని చూసుకుంటూ ఎంతో మురిసిపోతున్నారు రేవంత్. అందుకే ఎలాంటి ఇంటర్వ్యూలకు హాజరవ్వకుండా పూర్తి సమయం పాపకు, భార్యకు కేటాయిస్తున్నాడని ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మరోవైపు రేవంత్ టైటిల్ కొట్టినా విలువ లేకుండా పోయిందంటున్నారు. ఓటింగ్ పరంగా రేవంత్ కంటే శ్రీహన్ కాస్త ఎక్కువ ఓటింగ్ ని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ఓటింగ్ లో శ్రీహన్ విన్ అయినప్పటికీ.. 40 లక్షల సూట్ కేస్ ఆఫర్ ని తీసుకొని రన్నరప్ గా నిలిచారు. ఒకవేళ 40 లక్షల ఆఫర్ రిజెక్ట్ చేసుంటే ఖచ్చితంగా శ్రీహాన్ టైటిల్ విన్ అవ్వడమే కాదు 50 లక్షల ప్రైజ్ మనీ, బ్రీజా కార్, సువర్ణభూమి ల్యాండ్ దక్కేవి.