సారీ చెప్పాల్సింది భారత్ కాదు, బీజేపీ.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

సారీ చెప్పాల్సింది భారత్ కాదు, బీజేపీ.. కేటీఆర్

June 6, 2022

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన ఆరోపణలపై గల్ఫ్ దేశాల స్పందనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాని టార్గెట్‌గా చేసుకున్నారు. బీజేపీ మతోన్మాదుల విద్వేషపూరిత ప్రసంగానికి.. భారతదేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నేత‌ల అడ్డగోలు వ్యాఖ్య‌ల‌కు దేశం ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాలి? క్ష‌మాప‌ణ చెప్పాల్సింది బీజేపీ త‌ప్ప దేశం కాదని కేటీఆర్ అన్నారు. విద్వేషం వెద‌జ‌ల్లుతున్నందుకు తొలుత ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు

మహ్మద్‌ ప్రవక్తపై ఓ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన మరో నేత నవీన్‌కుమార్‌ జిందాల్‌ కూడా అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించారు. దీంతో ఇరాన్‌, కువైట్‌, ఖతార్‌, పాకిస్థాన్‌ వంటి ముస్లిం దేశాలు భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భార‌త్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని గ‌ల్ఫ్ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్.. విద్వేషాన్ని వెదజల్లుతున్నందుకు ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు