why some people keep silent...reasons
mictv telugu

సైలంట్ గా ఉంటే తక్కువగా అంచనా వేయొద్దు

January 16, 2023

why some people keep silent...reasons

ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి సొంత అన్నదమ్ములు కూడా ఒకేలా ఉండరు. కొందరు ఎక్కువ మాట్లాడుతుంటే కొందరు తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొంత మంది వేగంగా పనులను పూర్తి చేసుకుంటారు. మరి కొందరు ఎంతో ఆలస్యంగా పనులు పూర్తి చేస్తారు. కొందరు బాగా చదువుకుంటే కొందరు అంత ఎక్కువ చదువుకోలేకపోతారు. ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కరి మేధస్సు ఒక్కోలా ఉంటుంది అందరు కూడా ఒకేలా ఉండలేరు.. ఉండరు కూడా.

ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరి శక్తిని వాళ్ళు తెలుసుకుని ఆసక్తి ఎందులో ఉంటే దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళతారు, విజయాన్ని సాధిస్తారు.అలానే మనం కొంత మంది జీవితాలను చూస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మరి కొంత మంది చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. అలాగే మాటల్లో కూడా ఎంతో తేడా ఉంటుంది. కొంత మంది చాలా బాగా ఎక్కువగా మాట్లాడుతుంటారు మరి కొందరు ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటారు. అయితే బాగా మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లెమ్ ఏమీ లేదు కానీ తక్కువ మాట్లాడే వాళ్ళతోనే అసలు సమస్య అంతా.

నిశ్శబ్దంగా ఉండే వాళ్ళలో తెలివైన వారు కూడా ఉంటారు. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఏదో ఒకటి మాట్లాడే కంటే కూడా సైలెంట్‌గా ఉండడం బెస్ట్ అని వాళ్ళు అనుకుంటారు. అందుకే బాగా తెలివైన వాళ్ళల్లో మాట్లాడకుండా నిశబ్దంగా కూర్చుంటారు.

మన ప్రపంచంలో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు కొందరు మాట్లాడారంటే అసలు ఆపరు. మరి కొందరు అస్సలు మాట్లాడరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అయితే సైలెంట్ గా ఉండడం వెనుక చాలా కారణాలు ఉంటాయి.వీరిని చూసి అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ నిశ్శబ్దం వెనుక ఎనిమిది కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుని వాళ్ళని అర్ధం చేసుకోవడం మంచిది అంటున్నారు మానసిక నిపుణులు. మరి మనం కూడా అవేంటో చూసేద్దామా.

భయం:

కొన్ని కొన్ని సార్లు కొంత మంది మాట్లాడ లేకపోతారు. మనసులో అనిపించినా సరే ఎక్స్ప్రెస్ చేయలేరు అటువంటప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి మాట్లాడాలని అనిపించినా సరే వాళ్ళు దాన్ని చెప్పలేక నిశ్శబ్దంగా ఉంటారు. ఇలా వాళ్ళు భయం వల్లనో మరే ఇతర కారణాల వలనో వాళ్ళు అనుకున్నది చెప్పలేక సతమతమవుతూ ఉంటారు. దీనితో ఇక మౌనంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకుని మాట్లాడరు. ఇది కూడా మాట్లాడకపోవడానికి వెనుక ఉండే ఒక కారణమే.

డిప్రెషన్:

డిప్రెషన్ అనేది మానసిక సమస్య. ఇలాంటి మానసిక సమస్య ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిదని అనుకుంటారు. డిప్రెషన్‌తో ఉండే వాళ్ళు ఎక్కువ ఆలోచనలతో కలిగి ఉంటారు. ఈ ఆలోచనల మూలంగా వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు. నోరు విప్పి మాట్లాడితే తామెక్కడ ఆనందంగా లేము అన్న విషయం తెలిసిపోతుందేమో అని అనుకుంటారు. అందుకే ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చుంటారు.

రహస్యాలని చెప్పకూడదని :

మనుషుల్లో ఇది కూడా ఒక రకం. వీళ్ళు చాలా రహస్యంగా కొన్ని విషయాలను ఉంచాలని అనుకుంటారు. అందుకే ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు. కానీ ఇతరుల అటెన్షన్‌ని కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా కళ్ళతో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం,ముఖంతో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతే కానీ వీళ్ళు వీళ్ళ గురించి చెప్పుకోరు. అలానే విషయాలను రహస్యంగా ఉంచుతూ ఉంటారు.

ఎక్కువగా మాట్లాడానికి సరిపోరేమో అని భయపడి మాట్లాడరు :

కొంత మంది నిశ్శబ్దంగా ఉండిపోవడానికి కారణం వీళ్ళు మాట్లాడడానికి సరిపోమేమో అనుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పేది ఇతరులకు నచ్చదేమో అని నోరు విప్పరు. ఎక్కువగా స్కూల్స్ మరియు వర్క్ ప్లేస్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే వీళ్ళకి వీళ్ళపై నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్ట పడరు. పైగా నలుగురు మాట్లాడినట్లు వీళ్ళు వారి కంటే బాగా తక్కువగా ఉన్నారేమో అని అనుకుంటారు ఈ కారణం వల్ల కూడా చాలా మంది మాట్లాడరు.

బాగా గమనిస్తూ ఉంటారు :

మరి కొంత మంది నిశ్శబ్దంగా ఉండడానికి కారణం గమనిస్తూ ఉండడమే. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడకుండా ఇతరుల్ని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆగి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారంటే…. మాట్లాడే వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది.

భయపడడం :

కొంత మందికి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా బాగా గందరగోళంగా అనిపించినా అస్సలు మాట్లాడలేరు. ఈ కారణం వలన కూడా చాలా మంది మాట్లాడకుండా మౌనంగా ఉండి పోతారు. ఇది కూడా మాట్లాడక పోవడానికి ఒక కారణమని చెప్పొచ్చు.

మంచి ఆలోచనల కోసం మౌనంగా ఉండటం :

ఏదైనా సమస్య కలిగినా లేదంటే ఏదైనా ఆలోచన రావాలన్నా మౌనంగా ఉండడమే మంచిదని కొంత మంది అనుకుంటారు. అందుకే కొంత మంది ఇలాంటి సమయంలో క్లారిటీ, మంచి నిర్ణయం తీసుకోవడానికి మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు.

చూశారా మౌనం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. అందుకనే ఎప్పుడైనా, ఎవరైనా మౌనంగా ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారిని అర్ధం చేసుకోవడం మంచిది.