పొద్దుతిరుగుడు పువ్వుకు, సూర్యుడికీ ఇదీ సంబంధం! - MicTv.in - Telugu News
mictv telugu

పొద్దుతిరుగుడు పువ్వుకు, సూర్యుడికీ ఇదీ సంబంధం!

November 20, 2020

sunflowerr

పసుపు పూసినట్లు పచ్చగా మెరిసిపోయే పొద్దు తిరుగుడు పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. అసలు దాని పేరులోనే వింత ఉంది. పొద్దును బట్టి… అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరిగే పువ్వు కనుక దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అంటాం. ఇంగ్లిష్‌లో సన్ ఫ్లవర్ అని అంటారు.  


ఈ పువ్వు ఎందుకలా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది? ఇది చాలా మందిలో మెదిలే ప్రశ్న. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎంతో చక్కగా కనిపెట్టారు. వృక్ష శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో ఈ పువ్వుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిశాయి. పొద్దు తిరుగుడు పువ్వు కాడల్లోని మూలకణాల ప్రత్యేక ఎదుగుదల వల్లే అది సూర్యుడివైపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాడల్లో పగటి పూట తూర్పు వైపున్న మూలకణాలు పెరగడంతో, పువ్వు అటువైపు తిరిగి అంటే సూర్యుడి ఉండే వైపునకు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు.
ది కోసం పరిశోధకులు ఓ చిన్న ప్రయోగం చేశారు. పొద్దు తిరుగుడు మొక్కల కాండాలపై సిరా మరకలు ఉంచారు. ఆ మొక్కల ఎదుగుదలను కెమెరాలతో వీడియో తీశారు. సూర్య గమనానికి తగినట్లు పువ్వులు దిశను మార్చటాన్ని, ఓ రోజులో మొక్కల వచ్చిన మార్పులు ఏంటి? వంటి విషయాలను పరిశోధకులు తెలుసుకున్నారు. ‘పొద్దున సూర్యుడి లేత కిరణాలు సోకగానే ఉష్ణోగ్రత బట్టి, పువ్వు తల భానుడి వైపు ఉండేలా మూల కణాలు పెరుగుతాయి. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తి పొందుటకే మొక్కలు ఇలా చేస్తాయి’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. 

కాగా, ఈ పొద్దు తిరుగుడు పువ్వుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంటలకే కాకుండా చాలా అవసరాలకు వాడతారు. సన్ ఫ్లవర్ నూనెను సౌందర్య సాధనాలు, చర్మ రక్షణకు సంబంధించిన కొన్ని ముందుల్లో కలుపుతారు. ఇందులో ఉండే విటమిన్ ‘ఇ’ కోలన్ క్యాన్సర్, డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడుతుంది. పొద్దు తిరుగుడు పువ్వుల్లో  30 రకాల జాతులు ఉన్నాయి.