తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే చనిపోవడంతో ముఖ్యంగా అతని భార్య, పిల్లలను చాలా వేదనకు గురి చేసింది. మరణం తర్వాత తారకరత్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తొలిసారి భర్త గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించింది. తారకరత్నకు సంబంధించిన ప్రత్యేక రోజును గుర్తు చేస్తూ విష్ చేసింది. ఫిబ్రవరి 22 తారకరత్న పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కూతురితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫాదర్.. బెస్ట్ హస్బెండ్.. అలాగే మంచి మానవత్వం ఉన్న వ్యక్తి..
నిన్ను చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ సో మచ్’ అంటూ ఎమోషనల్‌గా ప్రేమను వ్యక్తపరిచింది. ప్రతీ పుట్టినరోజుకి కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపే తారకరత్న ఈ పుట్టిన రోజుకి వారి మధ్య లేకపోవడంతో మరింత మనోవేదనకి గురి చేసింది. కాగా, అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వల్ల సొంత ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు.