అతిశభ్రత..భార్యను చంపి భర్త ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అతిశభ్రత..భార్యను చంపి భర్త ఆత్మహత్య

February 20, 2020

fffffnjf

కొందరికి అతి శుభ్రత అలవాటు ఉంటుంది. ప్రతిదీ శుభ్రంగా ఉండాలనుకుంటారు. బయటికి వెళ్లి ఇంటికి వస్తే స్నానం చేస్తారు. ఇది ఎదుటువారికి ఇబ్బందిగా ఉంటుంది. భార్యాభర్తల్లో ఎవరికైనా అతి శుభ్రత ఉంటే ఆ ప్రభావం భర్త, పిల్లలపై పడుతుంది. భార్య అతిశుభ్రతను తట్టుకోలేక ఓ భర్త ఆమెను చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది.

మైసూర్‌లోని మండహళ్లికి చెందిన శాంతమూర్తి (40), పుట్టమణి (38)కి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. పుట్టమణి మడికి అధికంగా ప్రాధాన్యమిచ్చేది. దీంతో భర్త బయటి నుంచి ఇంటికి వస్తే స్నానం చేశాకే లోనికి అనుమతించేది. ఇలా అతడు రోజుకు ఎన్నోసార్లు స్నానం చేయాల్సి వచ్చేది. పిల్లల స్కూల్ నుంచి వచ్చాక బ్యాగుల్ని కడిగి ఆరబెట్టేది. ఆమె పద్ధతి శ్రుతిమించడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ మంగళవారం పొలానికి వెళ్లారు. అక్కడ కూడా పుట్టమణి శుభ్రత విషయంలో భర్తను విసిగించింది. దీంతో ఆగ్రహానికి గురైన శాంతమూర్తి ఆమెను హత్య చేశాడు. తర్వాత ఇంటికి వెళ్లిన శాంతమూర్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.