భార్య తలనరికి ప్రియుడి ఇంటి ముందు పెట్టాడు! - MicTv.in - Telugu News
mictv telugu

భార్య తలనరికి ప్రియుడి ఇంటి ముందు పెట్టాడు!

October 15, 2020

Wife and lover incident in hyderabad.jp

భర్తకు పట్టిన అనుమానం అనే భూతం వివాహిత ప్రాణాలు తీసింది. ఈ దారుణం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు, అంశమ్మ(35) భార్యాభర్తలు. అంశమ్మకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సాయికి అనుమానం ఉంది. ఈ అంశమై దంపతులు ఇద్దరు అనేకసార్లు గొడవపడ్డారు. నీకు పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అంశమ్మను సాయిలు నిందిస్తూ ఉండేవాడు. నాకు ఏ వ్యక్తితో అక్రమ సంబంధం లేదని అంశమ్మ వాదిస్తూ వచ్చేది.

అయినా కూడా సాయిలు అనుమానం పోలేదు. ఈ విషయమై బుధవారం రాత్రి కూడా అంశమ్మతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అదే రాత్రి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మొండెం నుంచి తలను వేరు చేశాడు. మొండేన్ని ఇంటి సమీపంలో పడేసాడు. తలను నారాయణఖేడ్‌ తీసుకెళ్లి అంశమ్మతో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మానికి కట్టాడు. తర్వాత వెళ్లి నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు.