భార్య, ప్రియుడు లోపలున్నారని గడియపెట్టిన పోలీస్..తీరా చూస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్య, ప్రియుడు లోపలున్నారని గడియపెట్టిన పోలీస్..తీరా చూస్తే..

July 9, 2020

bfgnbgc

భార్యపై విపరీతంగా అనుమానం పెంచుకున్న పోలీస్ భర్త తిక్క కుదిరింది. తన భార్య ప్రియుడితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకున్నాడు. ఆమె లవర్ తో గదిలో ఉందని భావించి బయట నుంచి డోర్ లాక్ వేశాడు. నలుగురిని పిలిచి డోర్ తీయగా లోపలి తన భార్య అక్క వచ్చింది. దీంతో సదరు ఆ పోలీస్ కంగుతిన్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగింది. తన భార్య ఓ స్థానిక రాజకీయ నేతతో ఎఫైర్ పెట్టుకుందని ఓ కానిస్టేబుల్ అనుమానం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తునాడు. 

పొందుగల రోడ్డులో సదరు నేత ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఆమెతో రహస్యంగా కలుస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ నిఘా పెట్టాడు. ఇటీవల తన భార్య ఆ ఇంటికి వెళ్లిందని తెల్సింది. తన భార్య సదరు రాజకీయ నేతతో ఉండగా పట్టుకోవాలనుకున్నాడు. ఆ ఇంటికి బయట గడియ వేసి వెంటనే మీడియా మిత్రులు, పోలీసులకు ఫోన్ చేశాడు. వారందరు అక్కడికి చేరుకున్నాక ఇంటి తలుపు తీసాడు. లోపలి నుంచి తన భార్య వస్తుందని భావిస్తే ఆమె అక్క వచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె చెల్లెలి భర్త అయిన కానిస్టేబుల్‌ని బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాక్‌కి గురైన కానిస్టేబుల్ ఉద్యోగరీత్యా తన తోడల్లుడు ఊళ్లో ఉండడని.. తనతో పాటు తోడల్లుడి కాపురంలోనూ ఆ నేత చిచ్చుపెట్టాడని ఆరోపించాడు. అయితే సదరు నేతపై కేసు నమోదు కాలేదు.