Wife barricaded across the room .. Case against Pullareddy Sweets chief grandson
mictv telugu

భార్య గదికి అడ్డుగా గోడకట్టి.. పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు

May 14, 2022

Wife barricaded across the room .. Case against Pullareddy Sweets chief grandson

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ”ఏక్‌నాథ్ రెడ్డికి, ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఏక్‌నాథ్ రెడ్డి భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు రాకుండా రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు” అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఏక్‌నాథ్‌ రెడ్డిపై వరకట్న వేధింపులతోపాటు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందిన జి. పుల్లారెడ్డి 1948లో కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్‌‌లను స్థాపించి, వినియోగదారుల నుంచి మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై కేసు నమోదు అవడంతో సంచలనంగా మారింది.