ఎవరు భార్య...ఎవరు భర్త.... క్యాహే... కహానీ.... - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు భార్య…ఎవరు భర్త…. క్యాహే… కహానీ….

June 24, 2017

మొగ్గున్ని కొట్టి మొగసాలకెక్కిందనే సామెత ఉంది కదా. ఇది నిజమో కాదు  కరెక్ట్ గా తెలియదు కానీ… పూణేలోని మగవారిని అడిగితే  మాత్రం నూటికి నూరు శాతం ఇది పక్కా ఫ్యాక్ట్ అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేటట్లున్నరు. భర్తల చేతుల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ  కల్పించేందుకు, కేసుల విచారణ త్వరగా చేసేందుకు పూణే  పోలీసు శాఖ  ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మహిళ నుండి వచ్చే  సమస్యలు ఏమో కాని… పురుషుల నుండి కేసులు వరదలా వస్తున్నయట. తమ భార్యలు తీవ్రంగా కొడ్తున్నరని… తమ భార్యల  బారి నుండి తమను రక్షంచాలని వేడుకుంటున్నారట.

ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఐపీసీ, సీఆర్పీసీల్లో సవరణలు  చేసి మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు చేశారు. దీన్ని వాడుకుని కావాలని కొందరు మహిళలు తమ భర్తలను ఇబ్బందుల పాలు చేస్తున్నారనినేది పూణే భర్తల వాదన.

పూణే మహిళా విభాగానికి ఐదు నెలల కాలంలో 837 ఫిర్యాదులొస్తే దాంట్ల146 కేసులు భార్యా బాధితులవేనట. ప్రతి నెలకు భార్యా బాధితుల కేసులు పెరుగుతున్నాయట. కొందరు భర్తలు తమ భార్యల ప్రవర్తన అనుమానస్పందంగా ఉందని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నదని… ప్రత్యేకంగా తనకో ఇల్లు కట్టించాలని చెప్తున్నదని… తమపై దాడులు చేస్తున్నాదని… ఇట్లా చానా  రకాల కారణాలు భర్తలు తమ ఫిర్యాదుల్లో రాస్తున్నారట. వీటిపై ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారట.