లిప్‌లాక్‌లో నాలుక కట్… భార్యాభర్తలే - MicTv.in - Telugu News
mictv telugu

లిప్‌లాక్‌లో నాలుక కట్… భార్యాభర్తలే

September 24, 2018

భార్య కోపంలో వుంటే బుద్ధి వున్న భర్త అయితే ఏం చేస్తాడూ… తన నోటికి ఎందుకు తగలాలి అనుకుని గమ్మున ఊరుకుంటాడు. లేదంటే తనకు అర్థమయ్యే రీతిలో బుజ్జగించాలని చూస్తారు. భార్యాభర్తలు అన్నాక ఎంత కొట్టుకున్నా కోపాలు తగ్గాక మళ్ళీ కలిసిపోతారు. కానీ ఓ భర్త హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీని బాగా ఫాలో అయినట్టున్నాడు. భార్యకు వచ్చిన కోపాన్ని చల్లార్చడానికి లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. దీంతో ఆమె మరింత కోపోద్రిక్తురాలై అతని నాలుకను కొరికి పారేసింది. ఆశ్యర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన దేశ రాజధానిలోని రణ్‌హోలాలో చోటుచేసుకుంది. అన్యాయంగా తన నాలుకని కొరికిందని భార్యపై సదరు భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.Wife biting husband tongue in kissకేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఆర్టిస్టుగా పనిచేసే కరణ్‌ (22)కు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ పెళ్లి భార్యకు ఇష్టం లేదు. దీంతో తరచూ భర్తతో గొడవపడేది. ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. చిన్న చిన్న విషయాలకు ఇద్దరూ పలుమార్లు గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్తను ఎందుకు ఆలస్యం అయిందని నిలదీసింది భార్య. ఈ క్రమంలో కొద్ది సేపట్లోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

కోపంలో వున్న భార్యను అదుపు చేద్దామని సదరు భర్త ఓ పాచిక వేద్దామనుకున్నాడు. అదే ఇమ్రాన్ హాష్మి పాచిక. ‘జన్నత్2’ సినిమాలో కోపంలో వున్న తన భార్యను చల్లార్చడానికి భర్త అయిన ఇమ్రాన్ హష్మీ ఆమె లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. వెంటనే హీరోయిన్ చల్లబడుతుంది. ఈ సీన్‌ను అక్కడ అప్లై చేద్దామనుకున్నాడు సదరు భర్త. భార్యను పట్టుకుని లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. కానీ భార్య అతని అంతరార్థాన్ని పసిగట్టలేకపోయింది.

కోపంలో వున్న నాకు ఇలా అసందర్భంగా కిస్ ఇస్తావా అన్నట్టు భార్య మరింత ఆగ్రహంతో అతని నాలుకను పట్టి కొరికేసింది. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన కిరణ్ వెంటనే తేరుకుని, సఫ్టర్ జంగ్ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. కరణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం అతడు మాట్లాడలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వున్నాడు. అతని ఫిర్యాదు మేరకు భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, తన వైవాహిక జీవితం సంతోషంగా లేదని ఆమె పోలీసులకు తెలిపింది.