40 రోజులుగా మద్యంతో గొంతు తడవక మందుబాబులు నరకయాతన అనుభించారు. వీరికి కిక్కిచ్చేలా చివరకు కేంద్రం మద్యం అమ్ముకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. ఇంకేముంది వెంటనే వైన్ షాపుల గేట్లు తెరుచుకోవడంతో క్యూ కట్టిమరీ మందు కొనుక్కొని గొంతు తడుపుకున్నారు. ఇలా మద్యం దుకాణాలకు వచ్చిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. కొంత మంది వారిని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అవధ్రాబీ వద్ద ఓ మహిళ వైన్ షాపు ముందు క్యూ కట్టి మరీ మద్యం కొనుగోలు చేసింది. అలా తీసుకున్న మద్యం బాటిల్‌ను చీర కొంగులో దాచుకుని వెనుతిరిగింది. అక్కడున్నవారు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై స్థానికులు ఆమెను ప్రశ్నించారు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం అందరిని కలచివేసింది. తన భర్త మద్యానికి భానిసై మద్యం కోసం పరితపిస్తున్నాడని చెప్పింది. ఎండలో ఎక్కువ సేపు నిల్చోలేని పరిస్థితిలో ఉండటంతో తాను రాక తప్పలేదని వెల్లడించింది. కాగా ఇలాంటి ఘటనలు దేశంలో ఇంకా ఎన్నో ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వాలు ప్రజలను మద్యం అలవాటు చేసి ఖజానా ఎలా నింపుకుంటున్నాయో ఇవి ప్రత్యక్ష ఉదాహరణలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.