భర్త సమాధి వద్దే వేడుక.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

భర్త సమాధి వద్దే వేడుక.. వీడియో వైరల్

March 5, 2022

18

చనిపోయిన భర్త సమాధి వద్దే భార్య పెళ్లిరోజు జరుపుకున్న సంఘటన జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం, స్తంభంపల్లిలో గురువారం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకెళితే… గ్రామానికి చెందిన సుదర్శన్‌కు ప్రవళిక అనే అమ్మాయితో 2014లో వివాహం జరిగింది. ఇద్దరు దంపతులు ప్రతీ సంవత్సరం తమ పెళ్లి రోజును ఘనంగా జరుపుకునేవారు. అయితే భర్త సుదర్శన్ గతేడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి భర్త జ్ఞాపకాల్లోనే జీవిస్తోన్న ప్రవళిక.. ఈ ఏడాది పెళ్లి రోజు రావడంతో భర్తను తలుచుకుంటూ గురువారం సమాధి వద్దకు వెళ్లింది. భర్త సమాధిని పూలతో అలంకరించి కేక్ కట్ చేసింది. ఈ ఘటనను చూసిన బంధుమిత్రులు, స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.