ఐదువేల కోసం భార్య సూసైడ్.. చితిలోకి దూకిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

ఐదువేల కోసం భార్య సూసైడ్.. చితిలోకి దూకిన భర్త

April 12, 2022

12

ఓ భార్య తన భర్తను ఐదు వేల రూపాయలు అడిగితే ఇవ్వలేదనే కోపంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అంత్యక్రియల సమయంలో బాధతో భర్త ఆమె చితి మంటల్లో దూకేశాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మహోబాలోని జైత్పూర్ గ్రామంలో బ్రజేష్ అనే వ్యక్తి భార్య ఉమతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగాలేదు. ఆస్పత్రిలో చూపించుకునేందుకు ఓ ఐదువేల రూపాయలిమ్మని ఉమ భర్తను అడిగింది. దానికి భర్త బ్రజేష్ ఇప్పుడు లేవు. రేపిస్తానని బదులిచ్చాడు. దీంతో ఉమకు కోపమొచ్చి అదే రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు భార్య అంత్యక్రియల సమయంలో భర్త భార్య లేదనే బాధతో చితిలోకి దూకాడు. స్థానికులు వెంటనే స్పందించి చితి నుంచి తీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలో బ్రజేష్‌ను చేర్పించారు. అయితే ఈ ఘటనపై ఉమ తల్లిదండ్రులు తమ కూతురిది హత్య అని ఆరోపిస్తున్నారు. చిన్న కారణంతో చనిపోయేంత పిరికితనం తన కూతురికి లేదనీ, అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.