భర్త విడాకులు అడిగాడని.. ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

భర్త విడాకులు అడిగాడని.. ఆత్మహత్య

October 17, 2018

భర్త విడాకులు కావాలని నోటీసులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో బుధవారం ఉదయ చోటు చేసుకుంది.   

బెంగళూరుకు చెందిన రోహిత్, అశ్విని ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికీ సంవత్సరం క్రితం వివాహమైంది. అశ్విని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైద్యాధికారిణిగా పనిచేస్తుండేది. పెళ్లయిన కొద్ది రోజులదాకా వీరి కాపురం బాగానే ఉన్నా.. విభేదాల కారణంగా ఆశ్విని పుట్టింటికి వెళ్లిపోయింది.Wife Committed Suicide For Her Husband Ask Divorce, In bangalore దీంతో భార్య తిరిగి వస్తుందేమోనని ఎదురు చూసిన రోహిత్ ఎంతకూ అశ్విని రాకపోడంతో విడాకులు కోరుతూ నోటీసులు పంపాడు. నోటీసులు అందిన అశ్విని తీవ్ర మనస్తాపానికి గురైన అశ్విని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆమె వద్ద ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘సారీ’ అని మాత్రమే ఉంది. అయితే అదనపు కట్నం కోసం రోహత్ వేధిస్తుండటంతోనే అశ్విని ఈ దారుణానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.