వాలంటైన్ డే సందర్భంగా ఓ మహిళ తన భర్తకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. మామూలుగా గులాబీ పువ్వు ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరచడం రోటీన్ అనుకుందేమో.. కాస్త వెరైటీగా బంగారు గులాబీల బోకెను ఇచ్చింది. భర్తపై తనకున్న ప్రేమను అంతే విలువ గల 108 బంగారు గులాబీలతో హార్ట్ షేప్ లో రూపొందించిన ప్రత్యేక బొకేను భర్తకు ఇచ్చింది. తమ పెళ్లి తరువాత వచ్చిన వాలంటైన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దీని ధర దాదాపు 1లక్ష 80వేల రూపాయలు ఉంటుందని తయారీదారులు తెలిపారు.
గుజరాత్‌లోని సూరత్ కు చెందిన పరిధిబెన్ అనే మహిళ.. తన భర్త దీప్ కు ఈ బహుమతి ఇచ్చింది. “నిజమైన గులాబీలైతే వాడిపోతాయి. ఈ బంగారు పూత పూసిన గులాబీ అస్సలు వాడిపోవు. ఎల్లకాలం మా ప్రేమకు గుర్తుగా ఉంటాయి. నా భార్య ఇచ్చిన బహుమతితో చాలా సంతోషంగా ఉన్నాను” అని దీపు చెప్పాడు. ఈ ప్రేమికుల రోజున నా భర్తకు ఏదైన కొత్తగా ఇవ్వాలనుకున్నాని, అందుకే ఈ గులాబీ పూలు ఇచ్చానని పరిధిబెన్ తెలిపింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఆ భర్త.. లక్కీ హజ్బెండ్ అని కొందరు అంటుంటే.. మరికొందరు నిజమైన గులాబీలలో జీవం ఉంటుందంటున్నారు. ఇంకొందరైతే నిజమైన ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులేమీ అక్కర్లేదంటున్నారు.