వివాహేతర సంబంధాలు మంచివి కావని ఎవరెంత మొత్తుకుని చెబుతున్నా కొందరు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. సామాన్యుల సంగతి పక్కనపెడితే ఈ మధ్య ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా పాడుపని చేస్తూ సొంత పెళ్లానికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశాడు. వివరాలు.. గుజరాత్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గతంలో ఆ పార్టీ తరపున మంత్రిగా కూడా పనిచేశాడు.
ఇతను ఇటీవల ఓ యువతితో లాడ్జీలో రాసలీలలు సాగిస్తుండగా, మంత్రి భార్య కాపుకాసి ఇద్దరినీ ఉన్నపళంగా పట్టేసుకుంది. భర్త చేస్తున్న నిర్వాకాన్ని రికార్డు చేసింది. భర్తతో ఉన్న యువతిపై దాడి చేసి నాలుగు దెబ్బలు కొట్టేసింది. భార్య అకస్మాత్తుగా రూంలోకి రావడంతో షాకయిన మంత్రి యువతిని కొడుతున్న భార్యను అతి కష్టం మీద ఆపగలిగాడు. భార్య అక్కడికక్కడే నిలదీయడంతో ఖిన్నుడైన మాజీ మంత్రి చివరకి పోలస్ స్టేషన్లో కేసు పెట్టుకోమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.