భర్తను చంపి 8 ముక్కలు చేసినందుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను చంపి 8 ముక్కలు చేసినందుకు..

November 22, 2017

కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపి 8 ముక్కలుగా నరికేసిన భార్యకు 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. హరియాణాలోని జజ్జర్ కోర్టు బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. మిగతా నలుగురు నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. అసాందా గ్రామానికి చెందిన  దోషి పూజ గత ఏడాడి ఏప్రిల్లో తన భర్త బల్జీత్ ను చంపేసింది. పూజకు అక్రమ సంబంధం ఉండేది.భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా నరికేసింది. తన సోదరుడు కనిపించడంలేదని మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.